అభిమానులారా.. కాస్త ఓపిక పట్టండి : అల్లు అర్జున్ సందేశం

By Bojja Kumar

Recommended Video

Allu Arjun Passes A Sign Of Silence For His Fans

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' చిత్రం విడుదలైన రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు ఆయన తర్వాతి సినిమా మొదలు కాలేదు. అసలు ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో కూడా బన్నీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. దీంతో బన్నీ కంటే ఎక్కువ టెన్షన్ ఆయన అభిమానుల్లో మొదలైంది. దీంతో వారిని టెన్షన్ ఫ్రీ చేసి కూల్ చేసే ప్రయత్నం చేశాడు ఈ హీరో. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.

అభిమానులారా ఓపిక పట్టండి

అభిమానులారా ఓపిక పట్టండి

"నా ప్రియమైన అభిమానులారా... మీరు నాపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. నా తర్వాతి చిత్రం ఎప్పుడు వస్తుందనే విషయంలో ఓపికగా ఉండమని కోరుతున్నాను'' అని బన్నీ సూచించారు.

ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

నెక్ట్స్ మూవీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. అందుకే ఆలస్యం అవుతోంది అని బన్నీ తెలిపారు.

కొట్టితే గట్టిగా కొట్టాలనే ఉద్దేశ్యంలో

కొడితే బాక్సాఫీసు రికార్డులు బద్దలయ్యే హిట్ కొట్టాలనేది అల్లు అర్జున్ ఆలోచన. తన వద్దకు వచ్చే స్టోరీలన్నీ మామూలుగా, రోటీన్ స్టోరీలే కావడంతో మంచి సినిమా కోసం బన్నీ వెయిట్ చేస్తున్నాడు.

విక్రమ్ కె కుమార్ సినిమా లేనట్లేనా?

విక్రమ్ కె కుమార్ సినిమా లేనట్లేనా?

బన్నీ తన తర్వాతి మూవీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేసే అవాకశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఆ సినిమా లేనట్లే అని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X