మళ్లీ వస్తాను కాని, ఎప్పుడో తెలియదంటున్న ఊర్మిళ
చాలాకాలం తర్వాత మళ్లీ తెర పైన మెరిసేందుకు సిద్ధపడుతున్న ఊర్మిళ మంచి ప్రాధాన్యత ఉన్న కథ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు తన ప్రయాణం సాఫీగా సాగిందని, వెనక్కి తిరిగి చూసుకొని నిస్పృహకు లోనయ్యే పరిస్థితి లేదని చెప్పింది. తాను ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.
తన కేరీర్ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని 38 ఏళ్ల ముద్దుగుమ్మ విలేకరులతో చెప్పింది. ఊర్మిళ 1990లలో రంగీళా, జుదాయి, సత్య, ఏక్ హసీనా థి వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఊర్మిళ 2007లో విడుదలైన కర్జ్ చిత్రంలో కనిపించింది. యస్.. తాను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని, అందుకు కావాల్సిన బాడీ కోసం కొన్నాళ్లుగా తాను వర్క్ చేస్తున్నానని చెప్పింది.
గతంలో తాను ఎప్పుడూ చేయని స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. అయితే అది ఎప్పటిలోగా అవుతుందో చూడాలని ఈ ముద్దుగుమ్మ ముక్తాయించింది. తాను ప్రస్తుతం దర్శకత్వంపై దృష్టి సారించడం లేదని తెలిపింది. తనను ఎన్నో అంశాలు బిజీగా ఉంచుతాయని, తాను తన సొంత ప్రపంచంలో ఎప్పుడూ ప్రయాణిస్తూ బిజీగా ఉంటానని చెప్పింది.


Click it and Unblock the Notifications












