హజారేపై వర్మ సినిమా..‘అన్నా గ్యాంగ్’!
ముంబై : వివాదాస్సద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశాడు. అవినీతిపై పోరాడుతున్న అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన్నే టార్గెట్ గా చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.
త్వరలో తాను 'అన్నా గ్యాంగ్' పేరుతో సినిమా తీయబోతున్నానని, గాంధేయ వాదంతో ముందుకు సాగుతున్న ఓ పొలిటీషియన్ విసుగెత్తి అండర్ వరల్డ్ గ్యాంగ్ ఎలా ఏర్పాటు చేశాడనేది ఈ చిత్రంలో చూపిస్తానని వెల్లడించారు. గతంలో దావూద్ గ్యాంగ్ మాదిరి అన్నా గ్యాంగ్ కూడా పేరుమోసిన గ్యాంగ్ గా ఈ సినిమాలో చూపిస్తాడట.
గతంలోనూ రామ్ గోపాల్ వర్మ అన్నా హజారేపై కామెంట్లు చేశాడు. అధికారంలో ఉన్న వారు అవినీతికి పాల్పడటం, అధికారంలో లేని వారు వారిని చూసి అసూయ పడుతూ పోరాటాలు చేయడం గత కొంత కాలంగా జరుగుతున్న విషయమే అని వర్మ వ్యాఖ్యానించాడు.
వర్మ ఇలాంటి సినిమా ప్రకటనలు ఇప్పటి వరకు చాలా చేశాడు. అందులో చాలా వరకు ఆచరణకు నోచుకోలేదు. తాను ఏం చేసినా ప్రచారం కోసం చేస్తా అని వర్మ గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు. మరి ఇది కూడా కేవలం అందుకోసమే అని ఆయన గురించి తెలిసిన వారంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











