»   » 30 ఏళ్లు గుర్తుండిపోవాలి, కనివీని ఎరుగని రీతిలో ‘మహాభారతం’: రాజమౌళి

30 ఏళ్లు గుర్తుండిపోవాలి, కనివీని ఎరుగని రీతిలో ‘మహాభారతం’: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ రేంజిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రాజమౌళి భవిష్యత్తులో ఇంతకు మించిన సినిమాలు చేయబోతున్నాడు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం 'మహాభారతం'.

ఇండియా టుడే వారి సౌత్ కాన్‌క్లేవ్ 2017లో బాహుబలి సినిమాకు సంబంధించి తన ఆలోచనలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి రాజమౌళి వెల్లడించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి కూడా పలు ఆసక్తిక విషయాలు వెల్లడించారు.

కనీవినీ ఎరుగని రీతిలో మహాభారతం

కనీవినీ ఎరుగని రీతిలో మహాభారతం

తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం' అని చెప్పిన రాజమౌళి.... ఆ సినిమాను కనీ వనీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో తెరపై చూపించాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు తీస్తారనే విషయంలో మాత్రం రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు.

ఎంతగానో ప్రభావితం అయ్యాను

ఎంతగానో ప్రభావితం అయ్యాను

మహా భారతం నుండి ఓ పాత్రను తీసుకున్నా, లేదా ఓ ఉపకథను ఎంపిక చేసుకొన్నా తనను ఎంతగానో ప్రభావితం చేస్తుందని, మహాభారతంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయని రాజమౌళి చెప్పుకొచ్చారు.

తనకు నచ్చిన తర్వాత

తనకు నచ్చిన తర్వాత

తాను ఏ సినిమా చేయాలనుకున్నా .. ముందు ఆ కథ తనకు నచ్చాలని, తర్వాతే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే విషయం ఆలోచిస్తా, ఎలా చేస్తే వారు తాను ఎంచుకున్న కథను ఇష్టపడతారు అనే దానిపై ఫోకస్ పెడతానని రాజమౌళి తెలిపారు.

30 ఏళ్లు గుర్తుండి పోవాలి

30 ఏళ్లు గుర్తుండి పోవాలి

బాహుబలి సినిమా ప్రభావాన్ని 30 ఏళ్ల తర్వాత కూడా జనం గుర్తుంచుకోవాలి, అందుకే విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, అయ్యే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా రాజమౌళి స్పష్టం చేసారు.

నాకు పెద్దగా మార్కులు పడవు

నాకు పెద్దగా మార్కులు పడవు

ఓ కథ ఒరిజినాలిటీ విషయంలో తనకు పెద్దగా మార్కులేమీ పడవు, అమర్ చిత్ర కథల నుంచే తాను ఎక్కువగా స్ఫూర్తి పొందుతానని రాజమౌళి తెలిపారు.

భాషకు, సినిమాకు సంబంధం లేదు

భాషకు, సినిమాకు సంబంధం లేదు

భాషకు, సినిమాకు సంబంధం లేదని, విజువల్సే కథను, ఎమోషన్లను ప్రేక్షకులకు చేరవేస్తాయని, ఫలానా ప్రాంతం వాళ్లు ఫలానా జోనర్ చిత్రాలే చూస్తారు అనేదానికి తాను పూర్తిగా వ్యతిరేకమని రాజమౌళి అన్నారు.

మా నాన్న తొలిసారి అలా హగ్ చేసుకున్నారు

మా నాన్న తొలిసారి అలా హగ్ చేసుకున్నారు

బాహుబలి రిలీజ్ తర్వాత మా నాన్న రెండు సార్లో, మూడు సార్లో హగ్ చేసుకున్నారు, ఇలా జరుగడం నా జీవితంలో తొలిసారి అని రాజమౌళి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

English summary
Speaking at the India Today Conclave South in Chennai, Baahubali: The Conclusion director SS Rajamouli spoke of his desire to film Mahabharata. Rajamouli went on to say that dreams during the day and that his dreams are sky-high and have no limitations. He also added that he and his team shoots and makes a film and hopes that it matches his final dream but one always falls short of perfection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu