పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ రొమాంటిక్, యాక్షన్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్' చిత్రం రూపొందించిన దర్శకుడు హరీష్ శంకర్ తనదైన దర్శకత్వ కోణానికి అదిరిపోయే పంచ్ డైలాగులు, ఆకట్టుకునే స్క్రీప్లే జోడించి ఆ సినిమాను తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలిపిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో 'గబ్బర్ సింగ్' సీక్వెల్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తారని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా దీనికి స్వీకెల్ దర్శకుడుగా సంపత్ నంది ఎంపికయ్యారు. సంపత్ నంది కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడే కానీ..ఎందుకో అభిమానుల్లో ఏదో తెలియని వెలితి.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని ఇచ్చే మాట చెప్పారు సంపత్ నంది. త్వరలో తాను పవన్ కళ్యాణ్‌తో రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టెనర్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆగస్టు తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు బయట పెడతానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్లనే ఆవిషయాలను బయటపెట్టలేదని స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం హరీష్ శంకర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌ను స్టూడెంట్ లీడర్‌గా చూపెడుతున్నాు.


Click it and Unblock the Notifications











