కాబోయేవాడు అతనిలా అంటూ....ఇలియానా సెన్సేషన్!
హైదరాబాద్: గోవా బ్యూటీ ఇలియానా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే పశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తన తాజా బాలీవుడ్ మూవీ 'మే తెరా హీరో' అనే సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.....'మే తెరా హీరో' కోస్టార్ వరుణ్ ధావన్‌లా తనకు కాబోయే వాడు ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.
నా ఆలోచన విధానాలు, వరుణ్ ధావన్ ఆలోచన విధానాలు ఒకే విధంగా ఉంటాయి. ఆయన అన్ని విషయాల్లోనూ చాలా కేర్ తీసుకుంటాడు. అదే సమయంలో చిలిపి పనులు, ఫన్నీ థింగ్స్‌తో నవ్విస్తాడు అంటూ ఇలియానా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. మరి ఇలియానా అతనిలా తనకు కాబోయే భర్త ఉండాలని కోరుకుటోందా? లేక అతనే తన భర్త అయితే బాగుండని భావిస్తుందా? ఆమె మాట్లోని అంతరార్థం ఏమిటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఇటీవల వరుణ్ ధావన్ మాట్లాడుతూ....తనతో పాటు నటించే, సినిమా రంగానికి చెందిన వారితో డేటింగ్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చి చెప్పాడం గమనార్హం. మరి వరుణ్ ధావన్ లాంటి వేరొక వ్యక్తి, ఇలియానా మెచ్చిన గుణాలతో ఎప్పుడు లభిస్తాడో? అనేది వేచి చూడాలి.
'మే తెరా హీరో' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్, ఇలియానా, నర్గీస్ ఫక్రి హీరో హీరోయిన్లు. తెలుగులో హిట్టయిన కందిరీగ చిత్రానికి ఇదీ హిందీ రీమేక్. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











