నయనతారతో రొమాన్స్ చేయాలనుంది: అక్కినేని
నయనతారతో ఒకసారి రొమాన్స్ చేయాలని ఉంది అంటూ...సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు తన మనసులోని మాటను బయట పెట్టారు. బాలకృష్ణ, నయనతార జంటగా నటించిన శ్రీరామరాజ్యం ఆడియో వేడుకలో పాల్గొన్న అక్కినేని మాట్లాడుతూ....' నా వయసు 87 అయినా మనసు మాత్రం 27 ఏళ్లే. ఎవరైనా ముసలిమొగుడు-పడుచు పెళ్లాం సినిమా తీస్తే నయనతారతో జంటగా నటించాలని ఉంది" అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తన అందచందాలు, ఒంపు సొంపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన తార శ్రీరామ రాజ్యం సినిమాలో సీత పాత్రలో అద్బుతంగా నటించింది అటూ పొగడ్తలతో ముంచెత్తారు.
ఆ కాలంలో పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావును మించిన వారు లేరని...సింహం కడుపున సింహమే ఫుట్టినట్లు పౌరాణిక పాత్రల్లో బాలకృష్ణ అద్బుతంగా నటించి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడని అన్నారు అక్కినేని.
ఇకపోతే ముసలి వయసులో ముదురు కోరికలు కోరిన అక్కినేని కోరికను తీర్చడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తాడో? ముసలోడితో రొమాన్స్ చేయడానికి నయనతార ఒప్పకుంటుందా? అసలు అక్కినేని కోరిక తీరుతుందా? లేదా? అనేది వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











