»   » చిరంజీవిని ఆ పాత్రలో చూడాలని స్టార్ రైటర్ తపన

చిరంజీవిని ఆ పాత్రలో చూడాలని స్టార్ రైటర్ తపన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ ప్రముఖ స్వాంతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహానరెడ్డి కథను సిద్దం చేసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం అలాంటి కథ జోలికి పోకుండా కేవలం ఎంటర్టెన్మెంట్స్ సబ్జెక్టును మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే పరుచూరి గోపాలకృష్ణ మాత్రం చిరంజీవిని ‘ఉయ్యాలవాడ నరసింహానరెడ్డి'గా చూడాలనుకుంటున్నారు. రుద్రమదేవి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... అనుష్క రుద్రమదేవి చిత్రంలో పోషించిన పాత్ర ఆమె కెరీర్లో మెమరబుల్ పాత్ర అవుతుంది. ఎన్టీఆర్‌కు ‘శ్రీకృష్ణ దేవరాయ', కృష్ణం రాజుకు ‘భక్త కన్నప్ప', కృష్ణకు ‘అల్లూరి సీతారామరాజు' క్యారెక్టర్లు ఎంత పేరు తెచ్చాయో, అనుష్కకు రుద్రమదేవి అంతే పేరు తెస్తుందని అన్నారు. చిరంజీవిని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'గా చూడాలని ఉంది అని ఈ సందర్భంగా తన మనసులోని మాట బయట పెట్టారు.

 I want to see Chiranjeevi as Uyyalawada Narasimha Reddy

ఇక చిరంజీవి 150వ సినిమాకు సన్నద్ధం కావడంలో భాగంగా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సినిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి 150వ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

English summary
Paruchuri Gopalakrishna once again expressed his desire to see Chiranjeevi as Uyyalawada Narasimha Reddy.
Please Wait while comments are loading...