స్టేజి మీద నటించడం కన్నా సినిమాల్లో నటించడమే మేలు!!
బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ రాజకీయాలకు దూరంగా ఉందామని డిసైడ్ అయిపోయాడట, అవునండి.. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. "బాలీవుడ్‌లో నటించడమే బెటర్ ఈ రాజకీయాలు నాకొద్దు, ఇంకెప్పుడూ ఈ రాజకీయాల గురించి ఆలోచించనంటూ" 51 ఏళ్ల సంజయ్ తెగేసి చేప్పాశాడట. '' నేను మూడు నెలలు పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో తిరిగాను... అక్కడ పరిస్థితులను చూశాక అర్థమైంది స్టేజి మీద నటించడం కన్నా బాలివుడ్‌లో నటించడమే మంచద""ని సంజయ్ నవ్వుతూ అన్నారట.
లక్నో సమాజ్ వాదీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంజయ్ అనతి కాలంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీలో అమర్ సింగ్ తీరు పట్ల విచారం వ్యక్తం చేసిన సంజయ్ తన పదవీతో పాట పార్టీకి రాజీనామ చేశారు. ఈ విషయం పై స్పందించిన సంజయ్ దత్ సోదరి, కాంగ్రెస్ ఎంపి ప్రియా తన అన్నయ్య తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











