పవన్ సిగ్గుపడలేదు, ఆయన నిజాయితీ కేక, ఎంతో నేర్చుకున్నా: రామ్ గోపాల్ వర్మ
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాలు తిరుగుతూ రాజకీయ ప్రసంగాలు ఇచ్చారు. పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించారు. తనకు పరిటాల గుండు కొట్టించాడంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్‌పై ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ప్రసంగం చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

పవన్ స్పీచ్ చూసి థ్రిల్లయ్యాను
పవన్ కళ్యాణ్ తాజా లేటెస్ట్ స్పీచ్ ఇప్పుడే చూశాను. భిన్న అంశాలపై ఆయన స్పందించిన తీరు, ఆయనకు ఉన్న దూరదృష్టిని చూసి థ్రిల్ అయ్యాను అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

పవన్ అస్సలు సిగ్గు పడలేదు
తనపై ప్రచారంలో ఉన్నరూమర్ల మీద పవన్ కళ్యాణ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని, ఎంతో నిజాయితీగా స్పందించారని, ఈ క్రమంలో ఆయా వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ తన మనసులోని భావాలను, ఆలోచనలను ఏ మాత్రం సిగ్గుపడకుండా, దాచకుండా వ్యక్తం చేయడం బాగా నచ్చిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

పాఠం నేర్చుకున్నా
మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు, ఈ విషయంలో ఆయన నుండి నేను పాఠం నేర్చుకున్నాను. ఎందుకంటే, నాకు ఒక స్టుపిడ్ అలవాటు ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను... ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

గొప్ప నాయకుల్లో ఒకరుగా నిలుస్తారు
అన్ని అంశాలపై దూరదృష్టి ఉన్న పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోతారు అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











