ఒత్తిడి ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!
Recommended Video

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ తన దేవుడు అని, నేను ఆయన భక్తుడిగా చెప్పుకునే గణేష్ జనసేన పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. అభిమానం వేరు, రాజకీయాలు వేరు అంటూ... ఆ సమయంలో తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, రాక పోతే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ... స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా బండ్ల గణేష్ మీడియాలో హైలెట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో బండ్ల గణేష్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బండ్ల గణేష్ ట్వీట్
‘‘నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు. నా దైవం, నా బాస్.. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి.'' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
మీ నిజాయితీకి సలాం అంటూ...
కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని, ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్న బండ్ల గణేష్ మీద అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా పవన్ కళ్యాణ్‌ను ఒక్క మాట కూడా అనని మీ నిజాయితీకి సలాం... అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
బండ్ల గణేష్ నిజమైన అభిమాని అంటూ...
‘‘నమ్మకం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మా బండ్ల గణేష్ అన్న. బాస్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో ఎదిగిన వారు కూడా పక్క పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మీడియా వారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే లైవ్ నుంచి వెళ్లిపోతా అన్నాడు. అభిమానం అంటే అది'' అంటూ బండ్ల గణేష్ ట్వీట్‌ను పలువురు పికె అభిమానులు సమర్దిస్తున్నారు.
కొందరి నుంచి విమర్శలు..
"ఎలా ఉండే బండ్ల గణేష్ ఎలా అయిపోయాడు. ఏదేమైనా నీ మాటలను పట్టించుకునేవాడు లేడు, అసలు నీకే విలువ లేనప్పుడు ఇలాంటివి ఎన్ని పోస్టులు పెట్టినా దండగ" అంటూ కొందరు బండ్ల గణేష్ మీద విమర్శలు సైతం గుప్పించారు.


Click it and Unblock the Notifications











