ఆ దర్శకుడుతో చెయ్యాలనేదే తీరని కోరిక...రవితేజ
డాన్ శీను..రవితేజని మీకు ఇష్టమైన దర్శకుడు..మీరు చెయ్యాలనుకుంటున్న డైరక్టర్ ఎవరూ అని మీడియా వారు రీసెంట్ గా అడిగితే తడుముకోకుండా రామ్ గోపాల్ వర్మ అని చెప్పారు. రవితేజ మాట్లాడుతూ..నేను ఎప్పుడూ రామ్ గోపాల్ వర్మతో పనిచేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇండియాలో ది బెస్ట్ డైరక్టర్ ఎవరూ అంటే ఆయనే అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నారు. అలాగే...నేను రేపటి కోసం ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. ఏదైతో మంచి అనుకుంటోనో..అది అప్పుడే చేసేస్తాను. అలాగే నా కెరీర్ లో బెస్ట్ వరస్ట్ చిత్రం చంటి. ఇక నాకు ఇష్టమైన పాత్ర ఖడ్గంలో శ్రీకాంత్ చేసింది అని తన మనస్సులో మాట బయిట పెట్టారు. ప్రస్తుతం రవితేజ..రామ్ గోపాల్ వర్మ శిష్యుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











