twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద హీరోలతో అనుభవం కావాలి..జెనీలియా

    By Srikanya
    |

    సీనియర్‌ హీరోల పక్కన నటించినప్పుడు వారి అనుభవం నాకు హెల్ప్‌ అవుతుంది..వారితో ఆ ఎక్సిపీరియన్స్ పంచుకోవాలి..వారి పక్కన నటించడానికి నాకభ్యంతరం లేదు అంటోంది జెనీలియా. ఒకానొక దశలో నేను యంగ్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తాననే ప్రచారం జరిగింది. ఆ వార్తలు విని కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే ఓ సినిమాకి సైన్‌ చేసే ముందు నా పాత్ర బాగుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. హీరో గురించి అస్సలు ఆలోచించను. అలాగే కథ నచ్చితే చాలు నా పాత్ర నిడివి ఐదు నిముషాలు ఉన్నా సరే ఒప్పేసుకుంటాను అంటూ తన పాత్రల ఎంపిక గురించి చెప్పుకొచ్చింది.

    ఇక కెరీర్‌ ఆరంభంలో పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాల్లో చేశాను. అయితే ఆ చిత్రాలు కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడవని తెలుసుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే 'బొమ్మరిల్లు'కు అవకాశం వచ్చింది. ఆ సినిమా నా జీవితానికి మేలిమలుపు అయ్యింది. ఆ చిత్రం తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్‌లో కూడా నేనే నటించాను. ఒకే పాత్రను నాలుగు భాషల్లో చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అవకాశం నన్ను వరించింది. 'రెడీ' సినిమా విషయంలో కూడా ఇలా జరుగుతోంది. ఈ చిత్రం తమిళ రీమేక్‌ 'ఉత్తమ పుత్తిరన్‌'లో కూడా నేనే హీరోయిన్ గా నటిస్తున్నాను అంది జెనీలియా. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X