పియానో టీచర్ కావాలనుకొని... అల్లు అర్జున్
అల్లు అర్జున్ తను అస్సలు హీరో అవ్వాలనుకోలేదని కేవలం తనో పియానో టీచర్ ని కావాలనుకున్నానని మీడియాతో చెప్పారు. 2001లో 'గంగోత్రి'తో మొదలుపెట్టి... 'బద్రీనాథ్' వరకూ అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో పదేళ్ళ ప్రస్తానం పూర్తయింది.ఈ సందర్భంగా కలిసిన మీడియాతో బన్నీ మాట్లాడుతూ ఇలా స్పందించారు.బన్నీ మాటల్లోనే... ''నేను పియానో టీచర్‌ని కావాలనుకునేవాడిని.. తర్వాత మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవ్వాలనుకున్నాను. చివరికి యానిమేషన్ అభ్యసించి, ఇదిగో ఇలా సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పట్లో మార్షల్ ఆర్ట్స్‌లో నా టీచర్ కంటే బాగా రాణించగలనని అనుకునేవాణ్ణి, దానినే వృత్తిగా చేసుకోవాలని కూడా అనుకున్నాను. కాని ఆ కల నెరవేరలేదు. కాని ఇందులో ఉన్న ప్రాథమిక అవగాహన, జిమ్‌లో కసరత్తులు తనకు డాన్స్‌లో చాలా బాగా ఉపయోగపడ్డాయి అన్నారు.
అలాగే...సినిమాల్లో డ్యాన్స్‌లు చేయడం మొదలుపెట్టే వరకూ నేను డ్యాన్స్ చెయ్యగలనని నేనూ అనుకోలేదు. సినిమాల్లో కొరియోగ్రఫీని బాగా ఇష్టపడేవాణ్ణి. నేను జిమ్నాస్ట్‌ను కూడా అయినందువల్ల డ్యాన్స్ ఇంకా సులువు అయ్యింది అన్నారు. ఇక స్నేహారెడ్డితో పెళ్ళి వల్ల తన జీవితంలో ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పులేమీ లేవు. బహుశా తర్వాత ఏమైనా ఉండొచ్చేమో.. ప్రస్తుతానికి అంతా మామూలే.. డేటింగ్ చేస్తున్నట్టుంది అన్నారు. తన ప్రాజెక్టుల గురించి చెబుతూ... వచ్చే నెల నుంచీ ఇంకా పేరుపెట్టని ఒక తెలుగు సినిమాలో నటిస్తాను. ఇక బేసిక్‌గా నేను చెన్నై నుంచి వచ్చాను. అందువల్ల తర్వాత తమిళ సినిమాలో చెయ్యాలనుంది అన్నాడు. ఫైనల్ గా విజయం అనేది గమ్యమేగానీ ప్రయాణం కాదు.. నా గమ్యాన్ని ఇంకా చేరుకోవాల్సి ఉంది.మొదటి ఏడాది నుంచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమంటే ఒకటి పక్కన సున్నా చేరింది. ఈ ప్రయాణం ఒక మంచి అనుభూతినిచ్చింది.. ఎలా అన్నది వర్ణించడం కష్టం. నన్నడిగితే.. చక్కని సమన్వయంతో కొనసాగడమే ఇక్కడ ముఖ్యం '' అని అర్జున్ ఎంతో పరిణితితో చెప్పుకొచ్చారు. అలాగే రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











