ఫోర్న్ స్టార్ తో ఐటం సాంగ్....వర్మ
తన తాజా చిత్రం డిపార్టమెంట్ లో ఫోర్న్ స్టార్ సన్నిలియోన్ తో ఐటం సాంగ్ చేయిద్దాముకున్నానని,కానీ కుదరలేదని వర్మ అన్నారు. ఆయన బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ....తాను సన్నిలియోన్ కి పెద్ద ఫ్యాన్ ని అని,కానీ ఆమె మహేష్ భట్,పూజా భట్ అండర్ లో ఉండటం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని కామెంట్ చేసారు. అందుకే తను బ్రెజిలియన్ మోడల్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక సన్ని లియోన్ విషయానికి వస్తే ఆమె మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్ 2 లో హీరోయిన్ గా ఎంపికైంది. పూజా భట్ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఆ చిత్రం ఓ క్రైమ్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్ ని తీసుకోవటంతో ప్రాజెక్టు హాట్ గా మారింది. ట్రేడ్ లో ఓ రేంజి బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. సన్ని లియోన్ ని ఆ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాలోకి తీసుకోకూడదని ఎగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె వర్మ సినిమాలోకి రాలేదు. ఇక వర్మ డిపార్టమెంట్ లో రానా,మంచు లక్ష్మీ ప్రసన్న,సంజయ్ దత్,అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి కూడా విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











