twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దడ’ దెబ్బకు...ఒక్కొక్కరే బయటికొస్తున్నారు...!?

    By Sindhu
    |

    'దడ" ప్లాప్ కావటంతో ఇప్పుడు ఆ చిత్రంలో నటించిన వారందరికీ దడ పుట్టుకుంది. తమను ఎక్కడ మరిచిపోతారో అంటూ ఆ చిత్రంలోని నటీనటులు ఒక్కరొరక్కరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆ సినిమా హిట్ అయిందని..ఆ ఆనందం పంచుకుంటున్నామంటూ తాము చేయబోయే/చేస్తోన్న చిత్రాల వివారలను ఏకరువు పెడుతున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ ఇదే రీతిలో చెప్పుకుని తరించిపోతే ఇప్పుడు ఆ చిత్రంలో విలన్ గా నటించిన జునైద్ కూడా నడిచాడు. నిన్నప్రత్యేకంగా మీడియా సదస్సు పెట్టి మరీ తనకు ప్రకాష్ రాజ్ విలనిజం చాలా ఇష్టం అని చెబుతున్నాడు విలన్ జునైద్ షేక్

    బిజినెస్‌ కుటుంబంలో పుట్టి...అదే రంగంలో విద్యనభ్యసించినా..ఏదో తెలియని వెలితి, అసంతృప్తి! కొత్తగా ఏదైనా చేయాలని తలచి నటనారం గంలోకి వచ్చాను. నాకు నచ్చిన విలన్‌ ప్రకాష్‌రాజ్‌. తన నటనంటే చాలా ఇష్టం. అందుకే ఆయనలానే పెద్ద విలన్‌గా పేరు తెచ్చు కోవాలనుంది. తెలుగులో నా రెండో సినిమా 'దడ" మంచి గుర్తింపు తెచ్చింది" అన్నారు విలన్‌ జునైద్‌ షేక్‌. నాగచైతన్య 'దడ"లో ప్రతినాయ కుడిగా మెప్పించిన జునైద్‌ చెప్పిన సంగతులివి...

    నటశిక్షణ తర్వాత నేను నటించిన తొలిసినిమా 'పప్పు". వినాయకుడు ఆ చిత్రంలో హీరో. నాగచైతన్యతో రెండో సినిమా 'దడ" విలన్‌ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుతెచ్చింది. అజయ్‌ భుయాన్‌ క్లాస్‌ గా తెరకెక్కించారు. తెలివైన దర్శకుడు తను. మరో భారీ చిత్రానికి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌ 'దూకుడు" 3వ సినిమా. ఇందులో సోనూసూద్‌ ప్రధానవిలన్‌. నేను రెండోవిలన్‌ గా చేస్తున్నా. మహేష్‌తో కొన్ని ఫైట్‌ సీక్వెన్సుల్లో కనిపిస్తాను.

    శ్రీనువైట్ల చాకచక్యంగా ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళంలోనూ విజయ్‌ హీరోగా దీపావళికి వస్తున్న 'వేలాయుధం"లో విలన్‌గా నటించాను. ఇవేగాక తెలుగులో ఓ రెండు సినిమాల్లో హీరోగా నటించనున్నా. 'అరుంధతి"లో సోనూసూద్‌ చేసిన పాత్ర..నా డ్రీమ్‌ రోల్‌. అలాంటి పాత్రలో చేయాలి. అలాగే బాలీవుడ్‌ లో మమేష్‌ భట్‌ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా. నవంబర్‌ లో సెట్స్‌ కెళుతున్నాం.

    మగధీర, కందిరీగ, పోకిరి...తెలుగులో నాకు నచ్చిన సినిమాలు. పూరిజగన్నాథ్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌ సహా పెద్ద దర్శకులందరి సినిమాల్లో నటించాలనుంది. నా స్వస్థలం జమ్మూ కాశ్మీర్‌. నటన ఆశయంగా ముంబైకొచ్చా. అక్కడ థియేటర్‌ అనుభవం గడించాను. నటన, వ్యాయామం ఇష్టం. నా నిత్యకృత్యాలవి.

    English summary
    Juned Shaikh who has been introduced to Tollywood Industry with Pappu Movie..Javed want to settle in Film industry as another Prakash Raj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X