లవ్ సీన్ లో సౌఖ్యం అనుభవిస్తున్న లీడర్ రాణా
బిపాసా బసుతో లవ్ సీన్ చేసేందుకు తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగిడుతున్న లీడర్ హీరో దగ్గుబాటి రాణా చెప్పాడు. అలాగే ఇటువంటి సీన్‌లలో పాల్గొనడం తనకు ఎంతో సౌఖ్యంగా ఉంటుందని ముక్తాయిస్తున్నాడు. లవ్ సీన్ వచ్చే సరికి తామిద్దరం స్నేహితులుగా ఉంటామని, సహనటులుగా ఇటువంటి సీన్లు చేయడం సౌకర్యవంతంగానే ఉంటుందన్నాడు. రోహన్ సిప్పీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాణాతోపాటు అభిషేక్ బచ్చన్, ఆదిత్య పంచోలీలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ తనకు కొత్త ప్రపంచమని, ఇటువంటి నటులతో కలిసి పని చేయడం సరదాగా ఉందని, ఇది తన అదృష్టమని రాణా పేర్కొన్నాడు. హిందీ సినిమాలు, నటులతో తనకు అనుబంధం లేకపోయినప్పటికీ దశాబ్దాలనుంచి తమ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అనేక హిందీ చిత్రాలను కూడా తీసిందంటూ గుర్తుచేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సహనటులు తనను ఏనాడూ దక్షిణాది నటుడిగా భావించలేదన్నాడు


Click it and Unblock the Notifications











