సల్మాన్ కేసు కొత్తమలుపు: నేరం ఒప్పుకున్న డ్రైవర్

By Bojja Kumar

హైదరాబాద్: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ సోమవారం కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తానే నడుపుతున్నానని, సల్మాన్ నడపలేదని స్పష్టం చేసాడు. ఈ కేసుకు సంబంధించిన సల్మాన్ ఖాన్ డ్రైవర్ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. సల్మాన్ ఖాన్ డ్రైవర్ నేరం ఒప్పుకోవడంతో కేసు కొత్త ములపు తిరిగినట్లయింది.

2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ఇటీవల సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసింది.

'I was Driving the Car,' Actor Salman Khan's Driver Says in Mumbai Court on 2002 Hit-and-Run Case

ప్రమాదం జరిగిన సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్ కారును నడుపుతున్నాడు' అని వివరించారు. అదే సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని..తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు సల్మాన్.

ఈ ఆ ఘటనకు సంబంధించి తన వాదన వినిపించడానికి ఖాన్‌కు ఇదొక కీలకమైన అవకాశం. సల్మాన్‌ఖాన్, డ్రైవర్ వాంగ్మూలంతో కేసు విచారణ దాదాపు పూర్తయినట్లే. త్వరలో కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X