నేను పవన్ చెల్లెల్ని కాదు: అను ఇమ్మాన్యుయేల్, పాత్ర వినగానే "నో" చెప్పిన నివేథా థామస్?
కెరీర్ స్టార్ట్ అయ్యింది మాతృభాష మలయాళం లో అయినా టాలీవుడ్ లోకి మల్లూ వలసల్లో భాగంగా వచ్చి ఇక్కడ క్రేజీ హీరోయిన్ గా మారాలనుకుటోంది అనూ ఇమ్మాన్యుయేల్, దానికి తగ్గట్టుగా టాలీవుడ్ కూడా బాగానే ఆదరిస్తోందీ కేరళ కుట్టిని. నానీ హీరోగా చేసిన మజ్ఞూ సినిమాతో తెల్గు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మాయి. త్వరగానే పేఅర్ స్టార్ లాంటి అగ్రహీరో సినిమాలో కూడా బుక్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ దైరెక్తర్ అయిన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబో అంటేనే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుందన్న విషం తెలిసిందే. అలాంతి ప్రాజెక్ట్ లో అవకాసం దక్కటం అంటే మామూలు విషయం కాదు అంటూ మురిసి పోతోంది...

భయపడిందట
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేయటం అనగానే కాస్త భయపడిందట, అంతే కాదు మొదటిరోజు బాగా ప్రిపేరై వెళ్లానని... కానీ ఆయన్ను చూడగానే అన్నీ మర్చిపోయానని పవన్ తో తన తొలిరోజు షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుని చెప్పింది. ఇప్పుడిప్పుడే తానూ ఒక స్టార్ హీరోయిన్ హోదాలోకి అడుగు పెడుతున్నానన్న భావన కూడా లోపల్లోపల ఉన్నట్టుంది. చాలా ఆనందంగా మాట్లాడేసింది.

చెల్లెలి పాత్ర అనుకొని
ముందు ఈ సినిమా యూనిట్ నుంచి ఫోన్ వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అడిగినప్పుడు ఆల్రెడీ కీర్తీ సురేష్ హీరోయిన్ కాబట్టి తనది చెల్లెలి పాత్ర అయి ఉంటుందని అనుకుందట. ముందు తటపటాయించినా తర్వాత హీరోయిన్ పాత్ర కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకుందట.

నివేథా థామస్ నో చెప్పిందట
నిజానికి ఈ సినిమాలో మొదట నివేథా థామస్ ని పవన్ చెల్లెలి కోసం సంప్రదించారనీ, అయితే హీరోయిన్ గా చేస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి చెల్లెలుగా కనిపించటం అంటే ఇక కెరీర్ సంగతి టాలీవుడ్ లో ఆఖరైనట్టే అని ఆలొచించుకొని ఆ పాత్రకి నివేథా నో చెప్పిందనీ ఒక టాక్ ఉంది. మరి ఇప్పుడు ఆ "చెల్లెలు" ఎవరో ఇంకా తెలియలేదు..

"ప్రేమిస్తే" సంధ్య
పాపం మళయాళీ పిల్లనే అయిన "ప్రేమిస్తే" సంధ్య ఈ మాత్రం ఆలోచించలేకే పవన్ పక్కన "అన్నవరం" లో చెల్లెలిగా కనిపించి తన కెరీర్ కి తానే హీరోయిన్ గా మంగళం పాడేసుకుంది. ఈ విశయం అనూ కి ఎవరన్నా చెప్పారో లేదో గానీ మోత్తానికి పవన్ కి చెల్లెలి పాత్ర అయితే ఒప్పుకునేదాన్ని కాదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది...

క్రేజీ కాంబినేషన్ కావటం తో
ఇక సినిమా విషయానికి వస్తే క్రేజీ కాంబినేషన్ కావటంతో ఇప్పటికే అంచనాలు ఊపు మీద ఉన్నాయి. ఓవర్సీస్ లో 20 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేయనుందని సమాచారం. వచ్చే ఏడాది లో రిలీజ్ కానున్న ఈ సినిమా అనూ కి ఎలాంతి బ్రేక్ తెస్తుందో చూడాలి. పవన్ సరసన కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











