రవితేజ జీవితమే స్ఫూర్తి అంటున్న బుడ్డ హీరో
హ్యాపీడేస్, యువత చిత్రాలు నటుడిగా మంచి గుర్తింపునిస్తే 'వీడుతేడా" సోలో హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది అని అంటున్నాడు సినిమా హీరో నిఖిల్. పవన్‌కళ్యాణ్, రవితేజ నటించిన చిత్రాలు విడుదల రోజు మొదటి ఆట చూడకుండా వుండలేను. ఈ ఇద్దరిలో రవితేజ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. రవితేజ సినీ జీవితం నాకు స్ఫూర్తి. అందుకే ఆయన తరహాలో నటిస్తావని అంతా అంటుంటారు. అది పెద్ద కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను అని నిఖిల్ వెల్లడించారు.
మా దర్శకుడు చిన్నికృష్ణకు ఈ చిత్రంతో విజయం దక్కడం ఆనందంగా వుంది. ఈ చిత్రం సాదిస్తున్న విజయాన్ని సునీల్ దృష్టిలో పెట్టుకుని చిన్నికృష్ణ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారని నిఖిల్ చెప్పారు.
నేను నటించిన హ్యాపీడేస్, యువత చిత్రాలకు ముందు పెద్దగా ప్రారంభ వసూళ్లు రాలేదు. ఆ తర్వాత సినిమా బాగుందని అంతటా టాక్ మొదలవడంతో ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ తరహాలోనే ఇప్పుడు వీడుతేడాకు కూడా మౌత్ పబ్లిసిటీ ప్లస్ అవుతోంది. నా సినిమా 'వీడు తేడా" 150 థియేటర్లలో విడుదలైంది. అంతటా మంచి ఓపెనింగ్స్ లభించాయి. నైజామ్ ఏరియా సురేష్‌బాబు విడుదల చేశారు. నా చిత్రానికి నైజామ్‌లో అదీ హైదరాబాద్‌లో సెంటర్స్ పెరగడం ఇదే తొలిసారి అని తెలిపాడు.


Click it and Unblock the Notifications











