twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను కిడ్నాప్ చేశారు: ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన హేమ

    |

    హేమ.. మొన్నటి వరకు సినీ నటిగా అందరికీ పరిచయమైన పేరు. కానీ, పది రోజుల కిందట ఆమె బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఇలా వెళ్లిందో లేదో.. వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఎవరైతే తనను మానిటర్‌గా ఎన్నుకున్నారో.. వాళ్లే ఎలిమినేషన్‌ జోన్‌లోకి పంపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనికితోడు, ప్రేక్షకుల నుంచి కూడా ఆమెకు ఓట్లు తక్కువగా పోలవడంతో, హేమ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

    ఇక, హేమ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. వాటినే పలు న్యూస్ చానెళ్లు సైతం ప్రసారం చేశాయి. అదే సమయంలో వెబ్‌సైట్లలో కూడా దీనికి సంబంధించిన వార్తలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో హేమ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించింది.

    I was kidnapped: says Hema

    అసలు 'బిగ్ బాస్' హౌస్‌ నుంచి ఎందుకు వచ్చేసింది..? దానికి కారణం ఎవరు..? తదితర అంశాలపై ఆమె మాట్లాడింది. ''నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీలో రెబెల్ పర్సన్ అంటారు. అలాగే నవ్వుల హేమ అని కూడా కొందరు పిలుస్తారు. ఇప్పుడు 'బిగ్ బాస్'లోకి వెళ్లడం వల్ల కాంటవర్శీ హేమ అని పిలిపించుకోవాలని లేదు. అందుకే నేనేమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయను. ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎలిమినేట్ చేశారు'' అని ఆమె చెప్పుకొచ్చారు.

    అలాగే, తాను ఎలిమినేట్ అయిన తర్వాత కొందరు కిడ్నాప్ చేశారని చెప్పారు. ''బిగ్ బాస్' షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక్కరోజు వాళ్లు నన్ను కిడ్నాప్ చేసేశారు. ఎవరికీ కనిపించకుండా నన్ను దాచేశారు. తర్వాతి ఎపిసోడ్ టీవీలో ప్రసారం అయిన అనంతరం నన్ను బయటకు పంపారు'' అని హేమ వివరించారు. వీటితో పాటు హౌస్‌లో ఎవరెవరు ఎలాంటి వారన్న దానిపైనా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

    English summary
    Actress Hema spoke to the media after leaving the Bigg Boss show. She expressed her dissatisfaction with being eliminated from the show for the first week. Hema said he was not worried.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X