షోయబ్ మాలిక్ తో నాకేం లేదు... బ్లేడు బాబ్జీ హీరోయిన్
టెన్నిస్ సానియా మీర్జాని వివాహం చేసుకుంటున్న షోయబ్ మాలిక్ తో తనకేమీ సంభందం లేదని బాలీవుడ్ తార సయాలీ భగత్ స్టేట్ మెంట్ ఇస్తోంది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ... నేను షోయబ్ మాలిక్ ని ఒంటరిగా ఎప్పుడూ కలవలేదు. ఇద్దరం ఓ సినిమా చేయాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు కలిసాం. అయితే ఆ సినిమా అనుకున్నప్పుడే మా ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ, డేటింగ్ చేస్తున్నామంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ కామన్ అని, ఓ రకమైన పబ్లిసిటీ అని అప్పుడు ఎంజాయ్ చేసాను. అయితే ఇప్పుడా రూమర్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే చాలా కష్టం. అయినా ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. నేనా విషయాన్నే మర్చిపోయాను. ఆ సినిమా కూడా పలు కారణాలతో ఆగిపోయింది. అయితే ఇప్పుడు నా కుటుంబానికి ఈ విషయమై హెరాస్ చేస్తూ కాల్స్ వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చింది. అయినా నా వయస్సు ఇరవై నాలుగేళ్ళు. పెళ్ళి గురించి అప్పుడే ఎందుకు ఆలోచిస్తాను అంది. ఆమె తెలుగులో బ్లేడు బాబ్జీ చిత్రంలో అల్లరి నరేష్ సరసన చేసింది.


Click it and Unblock the Notifications











