చిరంజీవి, బాలకృష్ణకన్నా నాకే ఎక్కువ : విజయశాంతి
అలాగే ..హీరోయిన్ అంటే పాటలకు, కొన్ని సీన్లకే పరిమితం చేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రాదా? హీరోలనే ఎందుకు గొప్పగా మాట్లాడతారనిపించేది. హీరోయిన్లను ఎందుకు తక్కువగా చేసి మాట్లాడతారు? అనే బాధ ఉండేది. లోలోపల చాలా కసిగా కూడా ఉండేది. యాక్చువల్‌గా హీరోయిన్ లేకపోతే సినిమా లేదు. హీరోని రెండున్నర గంటలు చూడాలంటే బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్ ఉంటేనే సినిమా బాగుంటుంది.
ఒకవేళ హీరో లేకపోయినా హీరోయిన్ ఉన్న సినిమాని చూస్తారు. ఇది గ్రహించే ఓ సవాల్‌గా తీసుకుని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను. టఫ్ కేరక్టర్స్ ఒప్పుకున్నాను. హీరోకి ఏమాత్రం హీరోయిన్ తక్కువ కాదని నిరూపించాలనుకున్నాను. అందుకే రిస్కీ ఫైట్స్ చేశాను. కాళ్లు, చేతులు విరిగినా ఫర్వాలేదని ఫిక్స్ అయ్యి, రిస్కీ ఫైట్ సీన్స్ ఒప్పుకున్నాను. సాధించాలనుకున్నది సాధించాను!
ఇక హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అప్పుడు బాధ కలిగేది. 'అయినా, అలా ఎందుకు మాట్లాడుతున్నార'ని ఎప్పుడూ ఎవరితోనూ వాదనలు పెట్టుకోలేదు. కానీ నా ఆలోచనా విధానం మారింది. అందుకే 'కర్తవ్యం'లాంటి సినిమా చేయాలనుకున్నాను. ఆ ప్రయోగం సక్సెస్ కావడం, 'లేడీ అమితాబ్' అని పేరు రావడం జరిగింది అని వివరించింది.


Click it and Unblock the Notifications












