»   » పవన్‌కళ్యాణ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు? చిరంజీవి లైసెన్స్‌డ్ గన్ తోనే

పవన్‌కళ్యాణ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు? చిరంజీవి లైసెన్స్‌డ్ గన్ తోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య పవర్ స్టార్ ఈ పేరు వింటేనే ఆవేశంగా చేసే ప్రసంగాలూ, సీరియస్ గా పట్టుదల ని కలిగి ఉండే చూపులే గుర్తొస్తాయ్. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ భయమంటే తెలియని మనిషి అన్నట్టు సీరియస్ గా కనిపించే పవన్ ఒకానొక దశలో విపరీతమైన అత్మన్యూనతకు లోనయ్యాడనీ, జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడనీ ఊహించగలరా..?? మీరు నమ్మలేకపోయినా ఇది నిజమట. స్వయంగా పవన్ ఈ విషయాన్ని చెప్పాడు.

ఈ సమాజంలో ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు అని ఏదేదో ఆలోచించుకుంటూ ఉండేవాడంట. దాంతో బాగా ఒత్తిడికి గురయ్యి చదువు మీద ధ్యాస పెట్టలేకపోయాడట. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన 10థ్ క్లాస్, ఇంటర్ ఇలా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. దానికి కారణం, ఈ సొసైటీ గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించడమే. అలాంటి టైం లో పవర్ స్టార్ ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడట. తన ప్రసంగం లో పవన్ చెప్పిన సంగతులు కొన్ని

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో:

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో:

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పవన్ ప్రసంగించటానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా దాదాపు గంటసేపు మాట్లాడిన పవన్.. తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు.

ఆత్మహత్యకు కూడా:

ఆత్మహత్యకు కూడా:

ఇదే సందర్భం లో తన చదువూ, బాల్యం గురించి చెబుతూ, తాను ఒక సారి చనిపోవాలనుకున్నాను, ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని చెప్పటం తో ఒక్కసారి అంతా షాక్ తిన్నారు. చదువులో తానెప్పుడూ వెనకేనని, చదువు అస్సలు అబ్బేదే కాదని వెల్లడించాడు.

విపరీతమైన విసుగు:

విపరీతమైన విసుగు:

పుస్తకాల్లో ఉన్నదానికి సమాజంలో జరుగుతున్నదానికి చాలా తేడాలను చిన్నప్పుడే గమనించానని, అది చూసి విపరీతమైన విసుగు పుట్టేదని, చదివేది, చూసేది వేరువేరని మనసుకు తెలుస్తుంటే, వాస్తవం చెప్పేవారు లేక తానెంతో మానసిక క్షోభను అనుభవించానని పవన్ చెప్పాడు.

ఆత్మహత్య చేసుకోవాలని:

ఆత్మహత్య చేసుకోవాలని:

తన జీవితంలో తీవ్రమైన ఒత్తిడికిలోనై పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని.. వాటిల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా తానిక్కడ నిలబడి ఉండేవాడిని కానని., అలానే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు తనను కొడుతూ ఉంటే ఒక్కోసారి తట్టుకోలేకపోయానని ఎన్నోసార్లు ఇక జీవితం వద్దని అనుకునేవాడట. .

 టెన్త్ క్లాస్ నుండి ;

టెన్త్ క్లాస్ నుండి ;

తన ఫ్రెండ్స్ అంతా పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళుతుంటే.. తన మనసు బాధపడేదని.. తాను వెళ్లలేకపోయినందుకు భాదపడుతూండేవాడట పవన్. టెన్త్ క్లాస్ నుండి అన్ని క్లాసులూ తప్పుతూనే వచ్చానని అన్నారు. పుస్తకాల్లో చెప్పేది వేరు, వాస్తవంగా జరిగేది ఒకటని.. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే ఆలోచనలే ఎప్పుడూ మనసులో ఉంచుకునే వాడట.

 చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌:

చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌:

అందుకే తాను రాసిన పరీక్షల్లో విజయవంతంగా ఫెయిల్ అయ్యానని.. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందని చెబుతూ... ఒకానొక దశలో తన అన్న చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నానని చెప్పాడు. అయితే అదృష్టం కొద్దీ పవన్ ప్రవర్తనని గమనించిన కుటుంబ సభ్యుల కౌన్సెలింగ్‌తో ‘ఆత్మహత్య' ఆలోచనలను విరమించుకున్నాడట.

 జాతీయ సమగ్రతకే :

జాతీయ సమగ్రతకే :

ఆ తర్వాత నెమ్మది..నెమ్మదిగా సమాజంపై అవగాహన పెంచుకున్నానని తన దృక్పదమే మారిపోయిందనీ చెప్పిన పవన్. , జనసేన పార్టీ ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తుందని ఇదే ఉద్దేశ్యం పార్టీలో ఎప్పటికీ ఉంటుందనీ వేదిక మీద చెప్పాడు.

 ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ :

ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ :

పవన్ కళ్యాణ్ ఈవిషయాలను ఉద్వేగభరితంగా మాట్లాడుతున్నంతసేపు ‘పవర్ స్టార్ పవర్ స్టార్' అరుపులతో బాగా చదువుకునే విద్యార్ధులు ఉండే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రాంతం కూడ దద్దరిల్లి పోవడం విశేషం. అంటే ఇక్కడే కాదు విదేశాల్లో ఉండే ఎన్నారైలలోనూ పవన్ మీద ఎంతో కొంత హోప్ ఉందన్నమాట.

English summary
Power star Pawan kalyan says that While he was doing his schooling, he was very bad at his grades and kept failing year after year. He had to face a lot of humiliation for the same. Frustrated, he thought of committing suicide using his brother Chiranjeevi’s licensed gun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu