twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఫ్యామిలీతో కలిసి అక్కడేతిరిగా, ఆ ధారుణానికి దగ్గరలోనే ఉన్నాను: మెహ్రీన్

    |

    మరణం మనిషిని ఎంత భయపెడుతుందో తెలియంది కాదు ఉగ్రపంజాకి రక్తమోడుతున్న న్యూయార్క్ ప్రియాంకా చోప్రానీ, టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జ్యాదా నీ విపరీతమైన భయంలోకి తోసింది. న్యూయార్క్ ఉగ్రదాడి ఘటనలో ఎనిమిది మంది పాదాచారులు మృత్యువాత పడ్డారు. ప్రియాంక చోప్రా నటిస్తున్న క్వాంటికో టీవీ షో మూడో సీజన్ కోసం ఆమె షూటింగ్ చేస్తుండగా ఉగ్రదాడి చోటుచేసుకొన్నది. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపం తెలిపింది. నేను షూటింగ్ చేస్తున్న ప్రదేశానికి ఐదు బ్లాకుల దూరంలో ఉగ్రదాడి జరిగింది.

    టెర్రర్ ఎటాక్ నుంచి తప్పించుకొన్న ప్రియాంక.. కూతవేటు దూరంలో ఉగ్రదాడిటెర్రర్ ఎటాక్ నుంచి తప్పించుకొన్న ప్రియాంక.. కూతవేటు దూరంలో ఉగ్రదాడి

    దారుణమైన సంఘటన ఇది

    దారుణమైన సంఘటన ఇది

    ముందుగా హ‌హాకారాలు వినిపించాయిని, . ఏం జరుగుతుందో అర్ధం కాలేద‌ని పేర్కొంది. ఆ త‌ర్వాత తుపాకీ పేలుళ్ల శ‌బ్ధం వినిపించింద‌ని తెలిపింది. "చాలా దారుణమైన సంఘటన ఇది.. పేలుళ్ల శబ్దం వినిపించగానే షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయాను" అని ప్రియాంక ట్వీట్ చేసింది.

    చెప్పకనే చెప్పాయి

    చెప్పకనే చెప్పాయి

    పేలుళ్ల శబ్దాలు ఈ ప్రపంచం ఏమిటో అనే విషయాన్ని నాకు చెప్పకనే చెప్పాయి. ఈ తాటకు చప్పుళ్లకు న్యూయార్క్ సిటీ బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడింది. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నది.

     మెహ్రీన్ కూడా న్యూయార్క్ లోనే ఉందట

    మెహ్రీన్ కూడా న్యూయార్క్ లోనే ఉందట

    అయితే ప్రియాంక విషయంలోనే ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ ని పక్కన పెడితే మన టాలీవుడ్ లో ఈ మధ్యనే కాస్త ఫామ్‌లోకి వస్తున్న మెహ్రీన్ కూడా న్యూయార్క్ లోనే ఉందట. సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందే ఆ ప్రదేశం లోనే ఉందట మెహరీన్, పొద్దున్నే అదే ప్రదేశంలో జరిగిన భీబత్సాన్ని చూసి ఒక్క సారిగా ఉలిక్కిపడిందట .

    ఫ్యామిలీతో కలిసి అక్కడే తిరిగాను

    ఫ్యామిలీతో కలిసి అక్కడే తిరిగాను

    "నిన్ననే మా ఫ్యామిలీతో కలిసి అక్కడే తిరిగాను.. కానీ ఈ రోజు అదే ప్రదేశం ఇంత భీభత్సంగా మారిపోయింది.. ఈ ప్రపంచం ఏమైపోతోందీ..? అంటూ ఆవేదనగా ట్వీట్ పెట్టింది మెహ్రీన్... అంతే కదా..! చావు అలా అంతదగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవటం ఎంత భయాన్ని కలిగిస్తుందో తెలిసిందే..

     బాగానే డిస్టర్బ్ అయినట్టు ఉంది

    బాగానే డిస్టర్బ్ అయినట్టు ఉంది

    అందులోనూ కుటుంబం అంతా కలిసి నవ్వుతూ తిరిగిన చోట ఇరవైనాలుగ్గంటలు గడవకముందే ఇప్పుడు రక్తం, మృతదేహాలతో కనిపించే సరికి బాగానే డిస్టర్బ్ అయినట్టు ఉంది పాపం. రేపు జవాన్ నుంచి విడుదలవబోతున్న ఒక సాంగ్ గురించి కూడా టెవిటర్లో పేట్టింది మెహ్రీన్... ఈ భయం నుంచి బయటపడటానికైనా ఆ సాంగ్ పనికొస్తుందేమో...

    సైలెంట్ గా మూడు హిట్లు

    సైలెంట్ గా మూడు హిట్లు

    ఈ భాదని కాసేపు పక్కన పెడితే ఇప్పటి వరకూ మరీ మారుమోగిపోయేంత అనలేం గానీ కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో సైలెంట్ గా మూడు హిట్ సినిమాలని ఖాతాలో వేసెసుకునుని ఇప్పుడు జవాన్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది.

    English summary
    "I was walking here with my family yesterday and today this horrifying incident took place. I don’t know what’s this world coming to?" Tweets Mehreen Pirzada
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X