For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్బులో తాగి గొడవ చేయలేదు, సిసిటీవీ సాక్ష్యం: అంజలి

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఓ పబ్ లో మధ్యం మత్తులో సినీ నటి అంజలి హల్ చల్ చేసినట్లు నిన్న హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 లోని తబల పబ్ కు శుక్రవారం రాత్రి అంజలి తన స్నేహితులతో కలిసి రావడం...అక్కడ చిన్న గొడవ జరిందనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగడం తెలిసిందే.

  అయితే ఈ ఘటనపై అంజలి వివరణ ఇచ్చింది. తాను మద్యం సేవించలేదని, గొడవ పడలేదని తెలిపింది. అంజలి మాట్లాడుతూ...‘నా స్నేహితురాలి బర్త్ డే పార్టీ ఉంటే రాత్రి 9 గంటల ప్రాంతంలో పబ్‌కి వెళ్లాను. అదే సమయంలో కొందరు మీడియా వారు ఉన్నారు. నన్ను ఆ సమయంలో ఫోటోలకు ఫోజులు ఇవ్వమని అడిగారు. మాది ప్రైవేట్ ఫంక్షన్ కావడంతో వద్దని రిక్వెస్ట్ చేసాను. అరగంట తర్వాత సర్వీస్ లిఫ్టు ద్వారా అక్కడి నుండి వెళ్లి పోయాను. కానీ మరునాడు మీడియాలో వార్తలు చూసి షాకయ్యాను. నేను తాగి గొడవ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ అధారంలేని రూమర్లు. నేను అసలు డ్రింక్ చేయలేదు. నాకు బాయ్ ఫ్రెండు కూడా లేడు. ఈ వార్తలు ఎవరు స్పెండ్ చేసారో తెలియదు. నేను హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. కావాలంటే పబ్ లో సీసీటీవీ పుటేజి చెక్ చేసుకోండి. అనవసరంగా నన్ను అబాసుపాలు చేయొద్దు' అని అంజలి చెప్పుకొచ్చింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  I wasn't drunk in the pub: Anjali

  అంజలి సినిమాల విషయానికి వస్తే... కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'గీతాంజలి'లో అందర్నీ భయపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించడానికి సిద్ధమవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'పిల్ల జమిందార్‌'తో ఆకట్టుకొన్న అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 10 వరకు అక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇది ఉత్కంఠ, వినోదం జోనర్‌లో సాగే చిత్రమని తెలుస్తోంది.

  భాగమతి అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాలోని టైటిల్ పాత్రలో అనుష్క నటించనుందని తొలుత ప్రచారం జరిగింది. ప్రస్తుతం అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బిజీగా వుండటం వల్ల ఆ స్థానంలో అంజలిని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఆసక్తికరమైన కథ, అభినయానికి ఆస్కారం వుండటంతో అంజలి ఈ సినిమాలో నటిండానికి సుముఖత వ్యక్తం చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

  English summary
  Anjali clarified saying, "I walked into the pub around 9:00 pm to greet my friend on her birthday party. A section of media, who was there at that time, even asked me to pose for camera, but I requested them not to take since it was a private function. I was there for half-an-hour and then left through service lift. But I'm really shocked to hear baseless rumours that I created a big scene at the party. I don't even drink and I don't have a boyfriend either.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X