»   » పెళ్ళి రద్దుపై నోరువిప్పిన నిఖిల్: అదే కారణమా?? లేక....

పెళ్ళి రద్దుపై నోరువిప్పిన నిఖిల్: అదే కారణమా?? లేక....

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజులు యంగ్ హీరో నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిఖిల్ పెళ్లి తన బంధువుల అమ్మాయితో ఫిక్స్ అయినట్టుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో నిఖిల్ తరుపున ఆ వార్తలు ఎవరూ ఖండించకపొవటంతో నిజమే అనుకున్నారు అంతా. అయితే తాజాగా జాతకాలు కలవని కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు తెర మీదకు వచ్చాయి.

పెళ్లి ఆలోచనను విరమించుకున్నారట

పెళ్లి ఆలోచనను విరమించుకున్నారట

జాతకాలు కుదరకపోవడంతో నిఖిల్ - తేజస్విని నిశ్చితార్థం.. పెళ్లి ఆలోచనను విరమించుకున్నాయట రెండు కుటుంబాలు. ఇద్దరి జాతకాలు కలవలేదని పండితులు చెప్పటంతో క్యాన్సిల్ చేసుకున్నారట. తేజస్విని బంధువుల నిఖిల్ బంధువుల అమ్మాయే. దీంతో నిఖిల్ ఫ్యామిలీ.. మరో అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని తొందర పడుతుందట.

సైలెంట్ గా ఉండిపోయాడు

సైలెంట్ గా ఉండిపోయాడు

బంధువుల్లోని మరో అమ్మాయితోనే పెళ్లి చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈసారి అన్ని జాతకాలు చూసి జాగ్రత్త పడాలని నిర్ణయించారు. అప్పటి వరకు ప్రకటించకుండా ఉండాలని భావిస్తున్నారు. దీనిపై నిఖిల్ అధికారికంగా ప్రకటించకపోయినా.... పెళ్ళి మాత్రం ఆగిపోయిందన్న మాట బలంగానే వినిపిస్తోంది. బయట ఇంత ప్రచారం జరుగుతున్నా తాను మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు నిఖిల్.

ఈ వార్తలపై స్పందించాడు

ఈ వార్తలపై స్పందించాడు

అయితే ఈ వార్తలు మరీ ఎక్కువయ్యేసరికి పరిస్థితి చేయిదాటుతుందనుకున్నాడేమో, నిఖిల్ ఈ వార్తలపై స్పందించాడు. నిఖిల్ పెళ్లి గురించి వచ్చిన ఓ వార్తను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నిఖిల్, అసలు పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా వచ్చిన వార్తలు నిజమో కాదో.. సూటిగా చెప్పకపోయినా.. ఈ వార్తలపై నేను స్పందించను అంటూనే.. నేను సింగిల్ గానే ఉన్నా.. త్వరలో చేయాల్సిన రెండు సినిమాల పనిలో బిజీగా ఉన్నా అంటూ కామెంట్ చేశాడు.

అసలు కారణం ఇదేనా

అసలు కారణం ఇదేనా

మరి అసలు కారణం ఇదేనా.. లేక ఇతరత్రా ఇంకేమైనా కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇంతకీ పెళ్ళి ఆగినట్టా..? జరుగుతుందని చెప్పినట్టా?? ఏటూ తేల్చకుండానే నోకామెంట్ అనేసాడు. ఇప్పటికి అయితే నిఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం గుట్టుగానే సాగుతుంది. ఇరు కుటుంబాలకు చెందిన వారెవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

English summary
"Ok. I dint want 2 comment on this.. but just to clear the air. I AM SINGLE nd commited only to the 2 movies that I'm working on" Tweeted Nikhil on his Marriege called off
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu