దర్శకుడికి, హీరోకి ప్రియాంక ఆఫర్..
''విజయ్ నా తొలి సినిమా నటుడు. మురుగదాస్ నా అభిమాన దర్శకుడు. వీరిద్దరితో పనిచేసే అవకాశమే వస్తే రెమ్యునరేషన్ విషయం కూడా పెద్దగా పట్టించుకోను"" అంటూ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అసలు ప్రియాంక వీరిద్దరి గురించి మాట్లాడటానికి ఓ కారణం ఉంది. త్వరలో ప్రియాంక ఓ తమిళ సినిమాలో నటించనున్నారని, విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారని ఓ గాసిప్ అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ మీడియాల్లో షికార్లు చేస్తుండటమే.
ఈ నేపథ్యంలో ప్రియాం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ''విజయ్‌తో నేను ఓ తమిళ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు అలాంటి ప్రపోజల్ నా దగ్గరకు రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం 'నో" చెప్పను. ఇలాంటి వార్తల వల్ల నా ప్రొడ్యూసర్స్ కంగారు పడే అవకాశం ఉంది. అందుకే క్లారిటీ కోసం వివరణ ఇవ్వాల్సి వచ్చింది"" అని చెప్పుకొచ్చింది ప్రియాంక.


Click it and Unblock the Notifications











