twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ స్టామినా నాకు వస్తే నేను చాలా లక్కీ: చిరంజీవి!

    By Sindhu
    |

    మెగాస్టార్ పొలిటీషన్ గాను మరియు ప్రాజారాజ్యం పార్టీ అద్యక్షుడుగా రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్లో నటించనని తానెప్పుడూ చెప్పలేదనీ, అయితే రాజకీలయాలకే తన తొలి ప్రాధాన్యమనీ, రెండు పడవలపైనా కాలు వేయడం మంచిదికాదనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు కాస్త దూరంగా వుండాల్సి వచ్చిందని చిరంజీవి చెబుతున్నారు. సినిమాల్లో నటించననీ, నటిస్తాననీ ఏమీ చెప్పని చిరంజీవి, రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్ని చూశాక అభిమానుల్ని మళ్ళీ కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తూ సినిమాలే శరణ్యమని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

    అందుకు అనువుగానే సినిమాల్లో నటించనని చెప్పలేదంటూ, తన తదుపరి సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించి ఫీలర్లు వదిలారు చిరంజీవి. తిరుపతి అఫిషియల్ విసిట్ వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అటు ప్రేక్షకులు ఇటు సినిమా ఇండస్ట్రీవారు కోరితే తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లో నటిస్తానని చెప్పారు. అయితే అది అంత సులభతరము కాదని, అలా నటించాలంటే తిరిగి మంచి ఎనర్జీతో నేను పూర్వ స్థితికి చేరుకోవాలని అందుకు నా బాడీని సహకరించమని అడుగుతానని చిన్న జోక్ వదిలారు. అయితే ఇలా రెండు పడవలపై ప్రయానించుటకు ఒక్క ఎన్టీఆర్ గారికే అది సాద్యపడిందని, ఒక వేళ అంతస్టామినా నాకు వస్తే నేను చాలా లక్కీ అంటూ సమాదానం ఇచ్చారు.

    మరైతే ఇంకేం చిరంజీవి నుంచి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి"కి తెర లేవనుందన్నమాట. ఈ విషయంమై దర్శకుడు వినాయక్, రచయితల పరుచూరి బ్రదర్స్ తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారనేది ఫిలింనగర్ లో విన్సిస్తోన్న హాట్ గాసిప్ సినిమా సంగతెలా వున్నా ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలలతో కలిసి పోరాడేందుకు సిద్దమని ప్రకటించారు చిరంజీవి, ఈ నెల 27 న దేశవ్యాప్తంగా ధరలకు వ్యతిరేకంగా 13 రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపు విషయమై పార్టీలో చర్చించి, బంద్ లో పాల్గొనాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి తిరుపతిలో అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X