»   » మహేష్ బాబు తప్ప ఎవరూ వద్దంటున్న హీరోయిన్

మహేష్ బాబు తప్ప ఎవరూ వద్దంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ సారి ఫ్యాషన్ సినిమాకు ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్న ఆమె....తాజాగా ‘క్వీన్' చిత్రంలో నటనకుగాను ఉత్తమ జాతీయ నటిగా ఎంపికయింది.

ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘క్వీన్' సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. అయితే అవార్డు వచ్చిన తర్వాత లైఫ్ పెద్ద మార్పేమీ లేదు. ప్రజలు నామీద మరింత ఫేయిత్ ప్రదర్శిస్తున్నారు. ఎప్పటిలాగే పెద్ద పెద్ద డైరెక్టర్ల నుండి ఉమెన్ సెంట్రిక్ సినిమా ఆఫర్లు వస్తున్నాయి' అన్నారు.

 Kangana Ranaut

సౌత్ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని....టాలీవుడ్లో నటించడానికి కూడా సిద్ధమే, అయితే మహేష్ బాబు నటించే అవకాశం వచ్చినపుడు మాత్రమే చేస్తా అని చెబుతోంది కంగనా రనౌత్. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఏక్ నిరంజన్' చిత్రంలో కంగనా నటించిన సంగతి తెలిసిందే.

English summary
Kangana speaking to scribes about getting offers from South said she is ready to star in Tollywood only if she gets opportunity to romance Super Star Prince Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu