»   » కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో మహేష్ కత్తిపై ఆరోపణలు, కేసు వేస్తా...కొణిదెల ఫ్యామిలీ పనే అన్న కత్తి!

కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో మహేష్ కత్తిపై ఆరోపణలు, కేసు వేస్తా...కొణిదెల ఫ్యామిలీ పనే అన్న కత్తి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి తెలుగు మీడియా ఛానల్స్ వేదికగా కొన్ని రోజులుగా చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలువురు నటీమణులు మీడియా ముందుకొచ్చి తమకు ఎదురైన సంఘటనల గురించి, తమను వేధింపులకు పాల్పడ్డ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల గురించి సంచలన విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా సినీ క్రిటిక్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో సునీత అనే ఆర్టిస్ట్ కత్తి మహేష్ మీద ఆరోపణలు చేశారు.

కత్తి మహేష్ మీద సునీత ఆరోపణలు ఇవే...

కత్తి మహేష్ మీద సునీత ఆరోపణలు ఇవే...

కత్తి మహేష్‌తో సంవత్సరం క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం. ఆయన బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కాల్ చేశాను. మీ పెర్ఫార్మెన్స్ బావుంది మెచ్చుకున్నాను. తర్వాత ఆయన్ను హైదరాబాద్‌లో కలిసినపుడు నీకు అవకాశాలు ఇప్పిస్తాను...కమిట్మెంట్ ఇస్తావా అని అడిగారు. దానికి నేను అంగీకరంచను అని చెప్పాను. అపుడు డోర్ వేసి బలవంతం చేశాడు. నేను ఒప్పుకోక పోవడంతో రెండు పీకి 500 బస్ టికెట్‌కు ఇచ్చి పంపించాడు అని సునీత ఆరోపించారు.

నా వద్ద అన్ని ప్రూప్స్ ఉన్నాయి

నా వద్ద అన్ని ప్రూప్స్ ఉన్నాయి

కత్తి మహేష్ ఇలా చేశాడు అనడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని లైవ్‌లో చూపించడానికి సిద్ధమే. ఆయన పెద్ద క్రిటిక్... నేను చెప్పిందే రివ్యూ అని మాట్లాడతాడు కదా... నా విషయంలో అలా ఎందుకు చేశారు అనే దానికి మహేష్ కత్తి నుండి సమాధానం కావాలి అని సునీత డిమాండ్ చేశారు.

ఇండస్ట్రీలో ఎవరికీ లొంగలేదు

ఇండస్ట్రీలో ఎవరికీ లొంగలేదు

నేను ఇండస్ట్రీకి వచ్చి రెండేన్నరేళ్లు అవుతోంది. నేను ఎవరికీ లొంగలేదు. అలాంటి పనులు చేసే వారి అప్రోచ్ ఎలా ఉంటుందంటే... సినిమా ఆఫీసుల్లో కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఉంటారు. అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్లినపుడు కాస్టింగ్ చేసే అసోసియేట్ డైరెక్టర్స్ మా ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడికి వస్తావా? ఇక్కడికి వస్తావా? అంటూ మెసేజ్ లు పెడతారు. అలా చేసిన చాలా మందితో నేను గొడవ పడ్డాను. ఇటీవల భరత్ అనే నేను సినిమాకు పని చేసిన శేషు అనే అసోసియేట్ డైరెక్టర్ కూడా ఇలాగే చేశాడు. నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు అని సునీత ఆరోపించారు.

 సునీతపై కేసు వేస్తాను, ఆమె వెనక కొణిదెల ప్రొడక్షన్స్

సునీతపై కేసు వేస్తాను, ఆమె వెనక కొణిదెల ప్రొడక్షన్స్

సునీత ఆరోపణలపై కత్తి మహేష్ స్పందించారు. తనపై కుట్ర జరుగుతోందని, ఆమె వెనుక మెగా ఫ్యామిలీ, కొణిదెల ప్రొడక్షన్ ఉందని, సునీతను ప్రేరేపించి నాపై ఆరోపణలు చేయించారని, ఆమెపై రూ.50లక్షలకు పరువు నష్టం దావా వేయబోతున్నట్లు మహేష్ కత్తి తెలిపారు.

వాకాడ అప్పారావు ప్రేరేపించాడు

సైరా సినిమా యూనిట్ కి సంబంధించిన వాకాడ అప్పారావు ఈ సునీత అనే అమ్మాయిని ప్రేరేపించి ఆరోపణలు చేయించాడని శృతి అనే నటి టీవీ9 సాక్షిగా చెప్పింది.... అని మహేష్ కత్తి అన్నారు.

English summary
"I will be filing a defamation case against Sunitha for falsely accusing me of sexual harassment and Konidela Productions for instigating her." Mahesh Kathi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X