అఫీషియల్: త్రిష ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్సయింది
హైదరాబాద్: హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ఆమె ప్రేమలో పడిందని, అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతోందని ఆ వార్తల సారాంశం. తాజాగా తన పెళ్లి విషయాన్ని త్రిష ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది.
‘నా ఫ్రెండ్స్, నా అభిమానులు మరియు మీడియాకు నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. జనవరి 23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. నా పెళ్లి డేట్ గురించి ఎలాంటి వార్తలు రాయొద్దు. ఇంకా ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను.' అని ట్వీట్ చేసింది.
‘నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ఏమీ చెప్పలేదు. మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం విడుదలయ్యే నా సినిమాలపై దృష్టి సారించాను' అని త్రిష స్పష్టం చేసింది.
తనకు కాబోయే వాడితో కలిసి ఇటీవల నార్తిండియా టూర్ కూడా ఎంజాయ్ చేసింది త్రిష. కాబోయే భార్య త్రిష, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో..

ప్రేమ పక్షలు
గత కొంత కాలంగా త్రిష-వరుణ్ ప్రేమలో మునిగి తేలుతున్నారు.

ప్రియురాలు కోసం
కొన్నిరోజుల క్రితం వరుణ్....త్రిషను, ఆమె స్నేహితులను ఇలా ప్రత్యేక విమానంలో విహార యాత్రకు తీసుకెళ్లారు.

తాజ్ మహల్ వద్ద
ప్రియుడితో కలిసి ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ సందర్శించింది.

త్రిష చాలా సంతోషంగా ఉంది
తన అభిరుచులు, తన పద్దతులు, తన అలవాట్లు అర్థం చేసుకుని, తనకు నచ్చిన విధంగా ఉండే వాడు భర్త అవుతుండటంతో త్రిష చాలా సంతోషంగా ఉంది.


Click it and Unblock the Notifications











