పవన్ కళ్యాణ్ జీవితం ఇచ్చారంటోంది
పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో చేసిన కీర్తి కర్బందా గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఓ కన్నడ చిత్రం కమిటైంది.ఆ చిత్రం తమిళంలో వచ్చి విజయవంతమైన సుబ్రమణ్యపురం(తెలుగులో అనంతపరం)కి రీమేక్. అందులో కలర్స్ స్వాతి చేసిన పాత్రలో కీర్తి కనిపించనుంది. అలాగే ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ సరసన త్రీడి చిత్రం ఓమ్ లోనూ ఎంపికైంది. ఆమె తీన్ మార్ చిత్రంలో చేయటం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని భావిస్తోంది. ఆమె మాట్లాడుతూ... నా పాత్ర తీన్ మార్ లో పెద్దగా లేకపోయినప్పటికీ, మీడియా, పబ్లిక్ అటెంక్షన్ లోకి తీసుకు వచ్చిందా సినిమా. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా నన్ను గుర్తించి ఆఫర్స్ ఇస్తున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమానే. పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇక కళ్యాణ్ రామ్ చిత్రం విషయానికి వస్తే... రసూల్ ఎల్లోర్ ఒకరికి ఒకరు చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన సునీల్‌రెడ్డిని ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి షూటింగ్ మొదలైంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్తున్నారు. ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తున్నారు. చిజిల్డ్ బాడీతో ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. అందు కోసం నిపుణులైన శిక్షకుల దగ్గర తర్ఫీదు తీసుకొంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











