‘ఆ వెంటనే బిడ్డను కంటాను’ అంటున్న సమంత
హైదరాబాద్: సమంతకు ఇంకా పెళ్లి కానేలేదు...అప్పుడే బిడ్డ గురించి మాట్లాడుతుందేమిటని అనుకుంటున్నారా?. ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు. ఓ టీవీ కార్యక్రమంలో పెళ్లి, పెళ్లి పిల్లల గురించి అడిగినపుడు తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చింది సమంత.
ప్రస్తుతం సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత మాట్లాడుతూ...మహా అయితే ఈ ఇండస్ట్రీలో రెండేళ్లు ఉంటాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఆ వెంటనే బిడ్డను కంటాను. ఇదంతా మాగ్జిమమ్ మూడేళ్లలోపే జరుగుతుంది. సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు. నా బేబీ 15 ఏళ్ల వయసొచ్చేసరికి నేను పూర్తిగా ఈ జాబ్(నటన) వదిలేస్తాను.

సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తమిళంలో కత్తి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
దీంతో పాటు తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











