పవన్ తో ‘పులి’ నే కాదు మరో సినిమా కూడా చేస్తా...!
పవన్ కళ్యాణ్ హీరోగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు ఎస్.జె. సూర్య ఈసారి తానే నిర్మాతగా మారి మరీ, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ఎస్ జె సూర్య ప్రకటించాడు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో తాను కలిసి పనిచేసిన వ్యక్తులందరిలోకీ పవన్ వ్యక్తిత్వం ప్రత్యేకమైనదన్న ఎస్ జె సూర్య, తనకీ పవన్ కీ మంచి ర్యాపో కుదిరిందని చెప్పుకొచ్చాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.
పులి సినిమాని ప్లాప్ అంటూ ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, వసూళ్ళ పరంగా సినిమా సత్తా ఏంటో టాలీవుడ్ బాక్సీఫీస్ కి 'పులి" రుచి చూసిస్తోందని ఎస్ జె సూర్య అభిప్రాయపడ్డాడు. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం తప్ప, కమర్షియల్ హంగుల్లో చూపించాలనుకోలేదనీ, ఎంటర్ టైన్ మెంట్ కొంతమేర మిస్సవడం వెనుక హీరో పాత్ర తీరుతెన్నులే ప్రధాన కారణమని ఎస్ జె సూర్య వ్యాఖ్యానించాడు.
ఇదిలా వుంటే, 'పులి" పేరిట 35కోట్ల రూపాయల సొమ్మును ఖర్చు చేసి, చెత్త ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి వదిలాడంటూ, ఎస్ జె సూర్య పై టాలీవుడ్ లో ఆరోపణలు విన్పిస్తోన్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











