‘ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ మూవీ అతిపెద్ద సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ అందించిన కథతో పాపులర్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.ఎన్టీఆర్, నయనతార జోడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల వకమదిలో నిలిచిపోయిన అతి కొద్ది సినిమాల జాబితాలో చేరిందంటే కాదనలేం. అలాంటి మూవీకి సీక్వెల్ ఎప్పుడా? ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిర్మాత దర్శకుడు కోన వెంకట్ శుభవార్తను అందించారు. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

అదుర్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రూపొదిద్దుకొన్నది. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో కలిసి తారక్ చేసిన కామెడీ ఎవర్ గ్రీన్‌గా ఉండిపోయింది. ఎన్టీఆర్ బాడీ లాగ్వేజ్, పూజారీ గెటప్‌కు తగినట్టుగా పలికిన భాష, డైలాగ్స్ కరెక్ట్‌గా సరిపోయాయి. దాంతో ఆ చిత్రం ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా మారింది.

I will do hunger strike at NTR s House for Adhurs 2 movie Says Kona Venkat

అయితే కొద్దికాలంగా అదుర్స్ 2 సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అదుర్స్ సినిమాకు మంచి లైన్, పాయింట్ లభిస్తే.. సీక్వెల్‌లో నటించాలనే విషయాన్ని గతంలో ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపారనే విషయం మీడియాలో కనిపించింది. అయితే సరైన కథ కోసం ఎన్టీఆర్ చూస్తున్నారు. ఒకవేళ స్టోరీ లైన్ కనెక్ట్ అయితే తాను కూడా చేయడానికి సిద్దమే అనే విషయం బయటకు వచ్చింది.

అయితే తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ప్రమోషన్స్‌లొ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదుర్స్ మూవీకి సీక్వెల్ ఉంటుంది. ఆ సినిమాను తారక్ చేసేలా ఒప్పిస్తాను. ఒకవేళ ఓప్పుకోకపోతే ఆయన ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాను అని అన్నారు. తప్పకుండా ఎన్టీఆర్‌తో అదుర్స్ 2 సినిమా ఉంటుంది అని తెలిపారు.

I will do hunger strike at NTR s House for Adhurs 2 movie Says Kona Venkat

అదుర్స్‌లోని పూజారీ పాత్రోను తెలుగు హీరోల్లోనే కాదు.. ఇండియన్ సినిమా రంగంలో ఎన్టీఆర్ తప్ప మరొరకరు చేయలేరు. ఆయన చూపించిన హావభావాలు మరెవరూ చూపించలేదు. ఆయన చెప్పిన డైలాగ్స్ మరోకరు ఆ మ్యాడ్యులేషన్‌లో చెప్పడం కష్టం. ఆయనను మంచి చేసేవారు ఎవరు లేరు. ఆయనతో ఆ పాత్రను చేయిస్తాను అని అన్నారు.

ఇదిలా ఉండగా, కోన వెంకట్ నిర్మాతగా, కథకుడిగా గీతాంజలీ మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. చాలా ఏళ్ల తర్వాత గీతాంజలీ అనే సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందించారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటించి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X