twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది మీ హక్కు, నేను చేసేది చేస్తా: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఆపాలనే ఫిర్యాదుపై వర్మ!

    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల నిలిపివేయాలనికోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

    ఈ కంప్లయింట్ ప్రభావం చూపదు

    ఈ కంప్లయింట్ ప్రభావం చూపదు

    సినిమా ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి, ఎందుకు తీయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది తీసిన వాళ్లకు సంబంధించిన విషయం. దానితో డైరెక్ట్ కనెక్షన్ లేని ఎవరూ కూడా ఇలా కంప్లయింట్స్ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపదన్నారు. అయితే నేను ఈ సినిమాను కాంపెయిన్‌లా తీయలేదు. అందరికీ తెలిసిన, వాస్తవంగా జరిగిన సంఘటనలు చూపించడం జరిగింది. ఇది చంద్రబాబుకు నెగెటివ్‌గా తీశానని తాను ఎక్కడా చెప్పలేదు. దీనిపై ఎలక్షన్ కమీషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని.. ఆర్జీవీ వ్యాఖ్యానించారు.

    రిలీజ్ ఆపితే ఫైట్ చేస్తా...

    రిలీజ్ ఆపితే ఫైట్ చేస్తా...

    తన చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 22న విడుదల చేయబోతున్నట్లు వర్మ స్పష్టం చేశారు. ఒక వేళ ఈసీ అభ్యంతరం తెలిపితే సినిమా విడుదల కోసం ఫైట్ చేస్తానన్నారు.

    అవసరం అయితే కోర్టుకు వెళతానంటున్న దేవీబాబు

    అవసరం అయితే కోర్టుకు వెళతానంటున్న దేవీబాబు

    ఈ సినిమాపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఓ టీవీ ఛానల్ లైవ్‌లో మాట్లాడుతూ... ఎట్టి పరిస్థితుల్లోనూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మార్చి 22న రిలీజ్ కానివ్వబోము, అవసరం అయితే చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌ను కలుస్తాం.. అక్కడ న్యాయం జరుగకపోతే కోర్టు మెట్లు ఎక్కుతాం, ఎంత వరకైనా వెళతామని స్పష్టం చేశారు.

    కోర్టు మెట్లు ఎక్కుతారో, కోర్టు ముందు డాన్స్ చేస్తారో అది వారి ఇష్టం

    కోర్టు మెట్లు ఎక్కుతారో, కోర్టు ముందు డాన్స్ చేస్తారో అది వారి ఇష్టం

    దేవీబాబు వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... ‘కోర్టు మెట్లు ఎక్కుతారో.. కోర్టు ముందు డాన్స్ చేస్తారో అది వారి ఇష్టం. ఆయనకు కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. నేనేమీ కాదనడం లేదు' అని వర్మ వ్యాఖ్యానించారు.

    ఎన్టీఆర్ సినిమా తీసే అర్హత వర్మకు లేదు

    ఎన్టీఆర్ సినిమా తీసే అర్హత వర్మకు లేదు

    రామ్ గోపల్ వర్మకు అసలు మహిళలంటే గౌరవం లేదు, తెలుగుజాతి అంటే గౌరవం లేదు. ఎన్టీఆర్ సినిమా తీసే అర్హత అసలే లేదని, ఈసీలో న్యాయం జరుగకపోతే కోర్టుకైనా వెళతాం, ఇంకెంత దూరం అయినా వెళతామని దేవీబాబు తేల్చి చెప్పారు..

    English summary
    "Those from TDP party complaining to Election commission to STOP release of Lakshmis NTR because it might show the Andhra Pradesh Chief Minister ncbn in bad light should realise that no one can in hell can STOP TRUTH ." RGV tweeted. "I will fight, If Release is stopped: RGV reacts on Lakshmi's NTR Controversy." he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X