సమంత ప్రశ్నలు...మహేష్ పంచ్ లు (ఇంటర్వూ)
హైదరాబాద్: ‘మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఇంటర్వ్యూ అందరినీ అలరించింది. సమంత అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ తనదైన శైలిలో పంచ్ లతో సమాధానం ఇచ్చారు.
‘మేముసైతం'లో భాగంగా హీరో మహేశ్,దర్శకుడు త్రివిక్రమ్‌ను హీరోయిన్ సమంత కొన్ని ప్రశ్నలడిగారు ఆ ప్రశ్నాజవాబులు మీరు స్లైడ్ షోలో చూడవచ్చు.

ఎంబ్రాసింగ్ గా...
సమంత: మీ గత సినిమాల్లో ఏ సీన్‌ను చూసి బాగా చేయలేదే అని ఎంబ్రాసింగ్‌గా ఫీలయ్యారు?
మహేశ్: ఒక్క సీన్ ఏంటి? నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాను చూసినా ఎంబరాసింగ్‌గానే ఉంటుంది. ఇంకా బెటర్‌గా చేసుండొచ్చనే ఫీలింగ్ ఉంటుంది.

తొలి ప్రేమ...
మీ తొలి ప్రేమ గురించి చెప్పండి? ఏ వయసులో ప్రేమలో పడ్డారు?
అలాంటివి అడగకూడదు. అయినా నాకు పాతవేవీ గుర్తులేవు.

స్టార్ డమ్ ని ...
మీరు మా అందరి దృష్టిలో సూపర్‌స్టార్.సూపర్‌స్టార్‌డమ్‌ని మీరు ఎలా నిర్వచిస్తారు?
మనం చేసే సినిమాలను ప్రజలు అంగీకరించడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్థాయిలో మంచి సక్సెస్‌లు రాసాగుతాయి.

సిగ్గు పడతాం
ఇంతకీ మీరు మోస్ట్ డిజైరబుల్ మేన్‌గా ఆన్‌లైన్ ఓటింగ్‌లో సెలక్ట్ అయ్యారు కదా? ఏమనిపించింది?
కాస్త సిగ్గుపడ్డా. అలాంటి విషయాలు వినగానే సిగ్గుపడతాం కదా. నిజానికి అందరికీ చెప్పడానికి రెండు రోజుల ముందే నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. ‘థాంక్సండీ, అనందంగా ఉంద'ని చెప్పా. నన్ను ఎంపిక చేసిన ప్రేక్షకుల అభిమానానికి ధన్యవాదాలు.

అది నిజమే..
త్రివిక్రమ్‌గారూ.. మహేష్ నిజంగా సిగ్గుపడతారా?
నిజమే.

మీ హీరోయిన్లలో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు?
నచ్చిందనేకదా పెళ్లిచేసుకున్నది.

మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా?
ఒకదాని గురించి చెప్పడం కష్టం. ‘ఒక్కడు' నాకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమా. ‘అతడు' నన్ను క్లాస్ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా. దీంతోనే యు.ఎస్.మార్కెట్ ఓపెన్ అయింది. ‘పోకిరి' నన్ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిన చిత్రం.

అంటే ‘అతడు' తర్వాత మీ సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీ..
అలాంటిదేమీ కాదు.

మీ షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటున్నారు? నిజమేనా?
ఎవరూ చూడరు.

త్రివిక్రమ్‌తో ఎప్పుడు సినిమా? అందులో నేనుంటానా?
మేమిద్దరం కలిసి చేస్తాం. నీ గురించి చెప్పలేను. అంటే కథ డిమాండ్ చేయాలి కదా.
త్రివిక్రమ్: 2015లోనే ఉంటుంది.

త్రివిక్రమ్‌గారూ మహేష్‌లో మీకు నచ్చిందేంటి?
‘నువ్వే నువ్వే' కన్నా ముందే పద్మాలయాలో మహేష్‌కి ‘అతడు' కథ చెప్పా. కథ విని పది నిమిషాల తర్వాత వచ్చి, ‘సినిమా చేస్తున్నాం' అన్నాడు. అదే నమ్మకంతో అతను ఓపెనింగ్‌కి కూడా రాలేదు...

మహేశ్: అది నా సెంటిమెంట్
త్రివిక్రమ్: మహేష్ దర్శకుడిని అంతగా నమ్మే తీరు నచ్చుతుంది. దానివల్ల అతను చేసిన సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చేమో గానీ, అతను ఫెయిల్ కాలేదు. అక్కడ ఫెయిల్యూర్‌కి కూడా డిగ్నిటీ ఉంటుంది.

మహేశ్:
నేను డిస్కషన్ స్టేజ్‌లో స్ర్కిప్ట్‌ని ఓకే చేసేస్తాను. ఆ తర్వాత నాకు ఏదైనా డైరక్టర్ చెప్పాల్సిందే. ఇంకెవరు చెప్పినా వినను. పైగా సినిమా ఫ్లాప్ అయితే ఆ నేరాన్ని దర్శకుడి మీద వేయను.

ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూశారు?
మహేశ్: కత్తి చూశా. బావుంది.

కత్తి రీమేక్ చేస్తారా?
నేను చేయను. సినిమా క్రియేటివ్ జాబ్. ప్రతిక్షణం ఎగ్జయిట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ‘కత్తి' నేను చేస్తే నాకు ప్రతి షాట్‌కీ విజయ్ గుర్తుకొస్తారు. అందుకే నేను రీమేక్ చేసేంత కేపబుల్ కాదు.

మీ సినిమా ఎంత వరకొచ్చింది?
జరుగుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్. బాగా చేస్తోంది.

సమంత..
ఆ విషయం నేనడిగానా... త్రివిక్రమ్‌గారూ మన సినిమా గురించి చెప్పండి. ఈ సినిమాతో మీరు నాకు హిట్ ఇవ్వాలి?అసలే ఫ్లాపుల్లో ఉన్నా
త్రివిక్రమ్: అదేంటి ‘కత్తి'తో హిట్ కొట్టావు కదా.
మహేశ్: తెలుగులో పడ్డాయిలెండి. మామూలు దెబ్బలు కాదు.

మీరు సామాజిక స్పృహతో చేసే పనుల గురించి చెప్పండి?
మా అబ్బాయి గౌతమ్ నెలన్నర ముందుగా పుట్టాడు. అలాంటి సమయంలో డబ్బులున్నవారి సంగతి సరే. లేనివారి పరిస్థితి ఏంటి? అనే ఆలోచన వచ్చింది. అప్పడి నుంచి పసిపిల్లల కోసం మాకు తోచిన సాయం చేస్తున్నాం.

మహేశ్:
ఈ మధ్య సినిమాలుఫాస్ట్‌గా తీస్తున్నారేంటి త్రివిక్రమ్‌గారు?
త్రివిక్రమ్: చక్కటి టీమ్ కలిసి పనిచేసేటప్పుడు రోజులు ఎక్కువైతే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. అందుకే తక్కువ రోజులైతే బెస్ట్ అని.
మహేశ్: ఖలేజా తర్వాత జ్ఞానం వచ్చినట్టుంది.

సమంత :
ప్రతి సినిమానీ తొలి సినిమా అనుకుని చెయ్యి అని చెప్పిన మహేష్ మాటలను మర్చిపోను.ఇక విజయ్ ఆఫ్ స్ర్కీన్‌కి, ఆన్ స్ర్కీన్‌కీ చాలా డిఫరెంట్‌గా ఉంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా? అని ఆయన్ని ఓసారి అడిగేశాను.


Click it and Unblock the Notifications











