నన్ను రేప్ చేసిన దర్శకుడిని క్షమించడమా..ఛీఛీ!
నాపై అత్యాచారం చేసిన దర్శకుడు మాధుర్ బండార్కర్ ను ఎన్నటికీ క్షమించని తేల్చి చెబుతోంది ప్రీతిజైన్. మధుర్ బండార్క్ తన సినిమాల్లో హీరోయిన్ అవకాశం ఇస్తానని, పెళ్లి చేసుకుంటాడని నమ్మించి నాపై పలుసార్లు అత్యాచారం చేశాడని ప్రీతి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో మధుర్ బండార్కర్ కు ఇటీవలే బెయిల్ లభించింది కూడా. అతను దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్టు కోర్టులో డిపాజిట్ చేయాలనే షరతులతో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ఆ సంగతి అలా ఉంటే....ఒక వేళ మాధుర్ బండార్కర్ అతను చేసిన తప్పును ఒప్పుకుని, మిమ్మల్ని క్షమించమని అడిగితే మీరు అతన్ని విడిచి పెడతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ప్రీతి స్పందిస్తూ....నేను ఎన్నటికీ అతన్ని క్షమించను, నాలాంటి పరిస్థితులు భవిష్యత్ లో ఎవరూ ఎదుర్కోకుండా ఉండాలంటే మాధుర్ శిక్షింపబడాలి అని అంటోంది.
ఒక ప్రముఖ దర్వకుడిపై రేప్ కేసు నడుస్తుండటం, సినిమా రంగంలో మగువలకు సరైన భద్రత లేదు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న తరుణంలో.....ఈ కేసుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











