»   »  నెలకి 100 మంది, ఫ్యాన్స్‌కి సూపర్ ఛాన్స్....

నెలకి 100 మంది, ఫ్యాన్స్‌కి సూపర్ ఛాన్స్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేట్ చేయడంతో సల్మాన్ ఖాన్ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. మొక్కుబడిగా తన వంతు చేసి ఆపేయకుండా దీన్ని ఆయన కొనసాగించాలని నిర్ణయించారు సల్మాన్. స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఒక్కరే చేయగలిగేది కాదు...ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక నుండి నేను ప్రతి నెల 100 మందిని నామినేట్ చేస్తాను. దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇంటి వద్ద, మిగతా అన్ని చోట్లా సరైన విధంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించండి. స్వచ్ భారత్ ముందు, తర్వాత ఫోటోలు, వీడియోలు నాకు పంపండి. బాగా చేసిన ఐదుగురిని ఎంపిక చేసి, నా ఫేస్ బుక్ పేజీలో వారి గురించిన వివరాలు వెల్లడించడంతో పాటు బహుమతి అందజేస్తామని సల్మాన్ ఖాన్ తెలిపారు. సల్మాన్ ఖాన్ నుండి ప్రశంసలు, బహుమతులు అందుకోవడానికి అభిమానులు ఇంతకు మించిన అవకాశం మరేముంటుంది చెప్పండి?

I will nominate 100 followers a month for Swachh Bharat: Salman Khan

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అందులో కబీర్ ఖాన్ దర్శకత్వంలో చేస్తున్న ‘బజ్రంగి భాయ్ జాన్' చిత్రం ఒకటి. ఇందులో సల్మాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్. నవాజుద్దీన్ సిద్దికీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా సల్మాన్ ఖానే. జులైలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు ఆయన సూరజ్ ఆర్.బారజత్యా దర్శకత్వంలో ‘ప్రేమ్ రతన్ దాన్ పాయో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సోనమ్ కపూర్ హీరోయిన్. రాజ్ శ్రీ ప్రొడక్షన్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈచిత్రం విడుదల కానుంది.

English summary
"The Honorable Prime Minister nominated me for the Swachh Bharat campaign and I have cleaned and painted three villages in Maharashtra so far. I intend to continue with this initiative, but Swachh Bharat is not about what one of us can do. It’s about what each of us can do. So today, on Republic Day, I am taking this campaign social. I will nominate 100 followers a month for Swachh Bharat. Please start a sustainable Swachh Bharat initiative in and around your area of work or residence or both. Upload your before and after pictures or videos. Five of the best initiatives will get special mention on my Facebook page and also win a prize each" Salman Khan said.
Please Wait while comments are loading...