»   » భార్యతో నో.... : తేల్చి చెప్పిన హీరో ధనుష్

భార్యతో నో.... : తేల్చి చెప్పిన హీరో ధనుష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ఇక ఎప్పటికీ సినిమా చేయనని తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తేల్చి చెప్పారు. ఆ మధ్య తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన '3' చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో మళ్లీ తన భార్య దర్శకత్వంలో సినిమా చేయడానికి సాహసించడం లేదు ధనుష్.

ఇక పోతే ధనుష్, ఐశ్వర్య మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు వచ్చాయనే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి హీరోయిన్ శృతి హాసనే కారణమేనే పుకార్లు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై ధనుష్ స్పందిస్తూ....ఆ వార్తలను ఖండించారు. శృతి హాసన్, తాను మంచి స్నేహితులం అని ధనుష్ స్పష్టం చేసారు.

I will not act under My Wife direction: Dhanush

ఇక ఫుట్ బాల్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ....తన ఫేవరెట్ జట్టు బ్రెజిల్ అని, ఆ జట్టే గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే జర్మినీ విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ధనుష్ చెప్పకొచ్చారు.

ధనుష్‌కు సంబంధించిన సినిమా వివరాల్లోకి వెళితే..... ప్రస్తుతం మూడు తమిళ ప్రాజెక్టుల్లో, ఒక హిందీ ప్రాజెక్టులో చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హిందీలో 'షమితాబ్' అనే చిత్రంలో నటిస్తున్న ధనుష్ ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

English summary
Dhanush isn't keen on acting under the direction of his wife Aishwarya again after unpleasant experience while shooting for '3'. He, however, is looking forward to produce the films directed by his wife and he feels that's a better option.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu