Don't Miss!
- Sports
మా మాజీ క్రికెటర్లు యూట్యూబ్ వ్యూస్ కోసం దిగజారుతున్నారు: మిస్బా ఉల్ హక్
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరను.. కొందరు ఎంతకైనా దిగజారుతారు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు
సినిమా ఆఫర్ల కోసం దిగజారనని, తాను అలాంటి దానిని కాదని అందాల తార ఇలియానా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందనే విషయంపై ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

టాలీవుడ్‌లో అగ్రతార వెలుగొందిన ఆమె ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్దికాలంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లకే పరిమితమైంది.

నాది ఆ టైపు కాదు
సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాళు తగ్గాయి తప్ప మరో కారణం కాదు అని ఇలియానా ఇటీవల ఓ మీడియాతో చెప్పినట్టు సమాచారం.

చీప్ పాత్రలు వేయను
అవకాశాలు లేకపోయినా సరే కానీ ఏ పాత్ర పడితే అది చేయను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ఠ దెబ్బ తింటుంది అని ఇలియానా పేర్కొన్నట్టు తెలిసింది.

సినిమా అవకాశాలు లేక..
దేవదాసు లాంటి భారీ హిట్‌తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల పక్కన నటించింది. భారీ హిట్లను సొంతం చేసుకొన్నది ఇలియానా. పరిశ్రమలో తనకన్నా వయస్సులో పెద్ద హీరోయిన్లు కూడా రాణిస్తుంటే ఇలియానా మాత్రం ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా చేసిన దాఖలాలు లేవు.

ప్రియుడితో సరదాలు..
బాలీవుడ్ అవకాశాలపై దృష్టిపెట్టి ముంబైకి మకాం మార్చిన గోవా సుందరి ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి మొనాకో, బాలీ, లండన్, న్యూయార్క్ సిటీలలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల ఇలియానా తన ప్రియుడు అండ్రూతో కలిసి హాట్ హాట్ ఫొటో షూట్‌లో పాల్గొనగా, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అండ్రూ, ఇలియానా మధ్య బ్రేకప్ జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి.