హీరోయిన్ సమంత ప్రేమ వివాహం!
హైదరాబాద్: అతి తక్కువ కాలంలోనే టాప్ పొజిషన్ కి వచ్చిన హాట్ హీరోయిన్ సమంత.... ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటోంది. తాను అరేంజ్డ్ మ్యారేజికి, పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకోవడం అనే పద్దతికి వ్యతిరేకమని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది.
నచ్చిన వ్యక్తులను వివాహం చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది, ఒక వేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే వారిని పరిచయం చేయడానికి భయ పడను. తన మనసుకు నచ్చిన వాడు ఇప్పటి వరకు కనిపించ లేదు. నా ఆలోచనలకు తగిన విధంగా ఉంటే ప్రేమిస్తానని చెప్పింది. మరి సమంత మనసు దోచే మగాడు ఎక్కడున్నాడో?
అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. ప్రఖ్యాత డాక్టర్లను సంప్రదించినా ఆమె అనారోగ్యం నయం కాలేదని, చివరి ప్రయత్నంగా సమంత కేరళకు చెందిన ప్రముఖ తాంత్రి టి.ఎస్. వినీత్ భట్‌ను సంప్రదించిందనే వార్తలు వినిపించాయి. గ్రహా, నక్షత్రాలు, రాసులకు సంబంధించి స్థితిగతులు పరిశీలించి పూజలు చేస్తుంటాడు ఈ తాంత్రి.
సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











