»   » నాగ చైతన్య‌లా...అఖిల్ విషయంలో తప్పుచేయను: నాగ్

నాగ చైతన్య‌లా...అఖిల్ విషయంలో తప్పుచేయను: నాగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున రెండో వారసుడు అఖిల్ తెరంగ్రేటం ఖరారైంది. ఈ సంవత్సరమే అఖిల్ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.....ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అఖిల్ తొలి సినిమాను తానే నిర్మిస్తానని వెల్లడించారు.

'నాగ చైతన్య తొలి సినిమాను వేరే నిర్మాత చేతిలో పెట్టి తప్పు చేసాను. నేను నిర్మించే అవకాశం ఉండి చేయలేదు. కానీ అఖిల్ విషయంలో మాత్రం ఆ తప్పు చేయను. నేనే వాడి తొలి సినిమా నిర్మిస్తాను. కథ, దర్శకుడిని ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం వాడికే ఇస్తాను' అని నాగార్జున చెప్పుకొచ్చారు.

మరి నాగ చైతన్యను ఏ దర్శకుడి ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు? అనేది ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. వారసులు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలను అందుకుని సినిమా హిట్టయితేనే....వారికి ఫ్యూచర్ ఉంటుంది. తొలి ప్రయత్నంలోనే బోల్తా పడితే మళ్లీ లేవడం చాలా కష్టం.

గతంలో నాగ చైతన్య విషయంలో ఇలానే జరిగింది. చైతన్య అదృష్టం కొద్ది గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఏమాయ చేసావె' చిత్రం చేసి హిట్ కొట్టాడు. లేకుంటే అతనికున్న టాలెంటుకు అతని పరిస్థితి ఎలా ఉండేదో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న నాగార్జున అఖిల్ విషయంలో జాత్తలు తీసుకుంటున్నారు.

English summary
"I will produce Akhil’s debut film. I will leave the choice of story and director to Akhil but it won’t be an outside production house. I should have produced Naga Chaitanya’s debut flick. I won’t repeat that mistake in Akhil’s case" Nagarjuna said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu