నా ఫ్రెండే....: ఎలాగైనా రిలీజ్ చేస్తానంటూన్న ‘ఐ’ నిర్మాత
హైదరాబాద్: మద్రాసు హైకోర్టు ‘ఐ' సినిమా విడుదలపై స్టే విధించిన సంగతి తెలిసిందే. మూడు వారాల వరకు సినిమాను విడుదల చేయడానికి వీల్లేదంటూ హై కోర్టు ఆర్డర్ వేసింది. ఫైనాన్సియల్ సమస్యలే ఇందుకు కారణం. సినిమా నిర్మాణానికి తీసుకున్న ఫైనాన్స్ క్లియర్ చేయక పోవడంతో....ఫైనాన్సియర్ కోర్టు కెక్కారు.
అయితే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనవరి 14న విడుదల చేస్తాను అంటున్నారు. ‘మేమిద్దరం మంచి స్నేహితులం. త్వరలోనే మ్యాటర్ కోర్టు బయట సెటిల్ చేసుకుంటాం. ముందుగా ప్రకటించిన ప్రకారమే సినిమాను విడుదల చేస్తాం' అని మీడియాతో చెప్పారు. మరి సినిమాను విడుదల చేయడంలో నిర్మాత ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

ఈ స్టే రావటానికి దారితీసిన పరిస్ధితులు వెనక ఓ ఆంధ్రా ప్రొడ్యూసర్ ఉన్నాడంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆయన మరెవరో కాదు పివిపి సంస్ద అధినేత ప్రసాద్ వి పొట్లూరి. ఆయన నిర్మాతగానే కాకుండా పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ భారీ చిత్రానికి ఫైనాన్స్ చేసారని, దాంతో ఆ ఫైనాన్స్ ని క్లియర్ చేయమని కోర్టుకు ఎక్కారని చెప్పుకుంటున్నారు. సిని పరిశ్రమ నిభంధనల మేరకు...రిలీజ్ కు ముందే ఫైనాన్స్ లు అన్ని క్లియర్ చెయ్యాలి. దాంతో తమ వద్ద నుంచి తీసుకున్న మొత్తం క్లియర్ చెయ్యకుండా రిలీజ్ చేయటానికి వీల్లేదని పివిపి సంస్ద చెప్పి కోర్టుకు ఎక్కిందని, దాని పర్యవసానమే ఇదంతా అని చెప్పుకుంటున్నారు.
ఈ భారీ విజువల్ వండర్‌ని ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రై.లి అధినేతలు కలిసి తెలుగులో విడుదల చేయాల్సి ఉంది. అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో కోర్టు వివాదం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన యామీ జాక్సన్ కథానాయికగా నటించింది.
సురేష్ గోపి, ఉపేన్ పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ మొదలైన వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్.


Click it and Unblock the Notifications











