మళ్లీ సినిమాల్లోకి...(రేప్ కేసులో జైలుకెళ్లిన హీరో స్టేట్‌మెంట్)
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షైనీ ఆహుజా ఆ మధ్య పని మనిషిపై అత్యాచారం కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా ప్రస్తుతం ఈ యాక్టర్ బెయిల్‌పై బయకు వచ్చాడు. కేసు ఇంకా విచారణలో ఉంది. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మీడియా కంటపడ్డ షైనీని కదిలించగా.... ప్రస్తుతానికి సినీ జీవితానికి దూరంగా ఉంటున్నానని, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి నటిస్తానని వెల్లడించారు.
నటనను నేను వృత్తిగా భావించడం లేదు.. నాకు సినిమాలంటే వ్యామోహం, తన జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఈ రంగాన్ని వదిలిపెడదామని అనుకున్నాను, కానీ ఆ వ్యామోహమే నన్ను ఈ రంగాన్ని అంటి పెట్టుకునేలా చేసింది అని షైనీ ఆహుజా వెల్లడించారు. అత్యాచారం కేసు నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది, మరింత అణకువగా ఉండటం నేర్చుకున్నానని అంటున్నాడు.
2005లో 'హజారో క్వాషిషే ఐసీ' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టి షైనా ఆహుజా 'గ్యాంగ్ స్టర్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో 2009లో రేప్ కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇటీవల ఈ యాక్టర్ నటించిన 'ఘోస్ట్' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.


Click it and Unblock the Notifications












