శింబు గురించి అన్ని విషయాలు బయట పెడతా : హన్సిక
చెన్నై: తమిళ హీరో శింబు, హీరోయిన్ హన్సిక మధ్య కొన్ని రోజుల క్రితం ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. తాము ప్రేమించుకున్న విషయం వాస్తవమేనని హన్సిక స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతకాలం బాగానే వీరి మధ్య ప్రేమాయణం సాగింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఇద్దరూ విడిపోయారు.
తన మాజీ ప్రియురాలు నయనతారతో శింబు సినిమా చేయడానికి ఓకే చెప్పిన తర్వాతే........హన్సిక-శింబు విడిపోవడంతో దీనికి కారణం నయనతారే అని ప్రచారం కోలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వెలువడ్డాయి. నయనతారతో శింబు మళ్లీ క్లోజ్ గా మూవ్ అవ్వడం హన్సిక సహించలేక పోయందని టాక్.
ఇటీవల హన్సికను మీడియా వారు ఇదే విషయమై పశ్నించారు. శింబుతో ఎందుకు విడిపోయారు? అనే ప్రశ్నకు హన్సిక సమాధానం ఇస్తూ......శింబు గురించి అన్ని విషయాలు త్వరలోనే బయట పెడుతా, సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చిందట. హన్సిక ఇంత ఘాటుగా స్పందించడంతో ఆమె శింబు గురించి ఏలాంటి విషయాలు బయట పెడుతుందో? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

నిందలు వేసుకోలేదు
విడిపోయిన సందర్భంగా శింబు, హన్సిక ఒకరిపై ఒకరు నిందలు వేసుకోలేదు. తాము ఎందుకు విడిపోయామో అనే విషయాన్ని కూడా ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంచారు.

గౌరవప్రదంగా విడిపోవాలనే
శింబు, హన్సిక గౌరవ ప్రదంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు చేసుకోవడం వల్ల పరువు పోతుందనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇపుడెందుకిలా?
ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హన్సిక అన్ని విషయాలు సమయం వచ్చినపుడు చెబుతాను అని చెప్పడం చర్చనీయాంశం అయింది. ఇంతకాలం సైలెంటుగా ఉన్న హన్సిక ఇపుడు ఇలా ఎందుకు స్పందించింది?

నాలుగు సినిమాలతో శింబు బిజీ
ప్రస్తుతం శింబు నాలుగు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గౌతం మీనన్ దర్శకత్వంలో ఓసినిమాతో పాటు, వాలు, వెట్టై మన్నన్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

రెండు సినిమాల్లో కలిసి నటించారు
ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరు వాలు, వెట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చిన నేపథ్యంలో ఈచిత్రాలను కలిసి ప్రమోట్ చేస్తారో? లేదో? అనేది సందిగ్ధంగా మారింది.

8 చిత్రాల్లో హన్సిక
ప్రస్తుతం హన్సిక చేతిలో ఏకంగా 8 చిత్రాలు ఉన్నాయి. తెలుగుతో పాటు, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











