నరికేస్తామన్నారు...ఎన్నాళ్లు ఏడవాలి, రెండోపెళ్లి ఖాయం, విడాకుల గుట్టు విప్పుతా : రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య మరో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. త్వరలోనే అది జరుగుతుందన్నారు.పవన్ కళ్యాణ్ తో విడాకుల కారణాన్ని ఆత్మకథలో చెబుతాను, ఆయ నుండి నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదన్నారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్కే ఆమె పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు.
తన మోడలింగ్ డేస్, పవన్ కళ్యాణ్‌తో ప్రేమాయణం, విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఇలా చాలా విషయాలు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

అబ్బాయిలు నా వైపు చూడటం లేదని ఫీలయ్యేదాన్ని
మోడలింగ్ మొదలు పెట్టినపుడు నాకు నా మీద నమ్మకం లేదు. ఒక అబ్బాయి కూడా నా వైపు చూడటం లేదు నేను మోడల్ ఎలా అయ్యాను అనే ఫీలింగ్ ఉండేదు.... అని రేణు దేశాయ్ తెలిపారు.

తొలి చూపులోనే ప్రేమలో పడిపోయా
మోడలింగ్‌లో ఉన్నపుడూ ఎవరూ ప్రపోజ్ చేయలేదు. కళ్యాణ్ గారిని చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. ఇద్దరం అపుడు ఒకరినొకరం బాగా ఇష్టపడ్డామని రేణు దేశాయ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నాను
ట్రెడిషనల్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సహజీవనం అంటే తొలుత చాలా భయం వేసింది. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉండటం వల్లే ఆభయం పోయింది. అందువల్లే లివింగ్ టుగెదర్ సాధ్యమైంది... అని రేణు దేశాయ్ తెలిపారు.

మా మధ్య అలాంటి కోపం లేదు
డైవర్స్ తీసుకున్న వారు ఒకరిపై ఒకరు చాలా కోపంగా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోక పోవడం లాంటి వి ఉంటాయి. కానీ మా మధ్య అలాంటివి ఏమీ లేదు. ఇద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటాం. కొన్ని కారణాల వల్ల విడాకులు జరిగాయి.... అని రేణు దేశాయ్ తెలిపారు.

విడాకుల కారణం అపుడే చెబతా
ఎందుకు డైవర్స్ తీసుకున్నాను అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఏదో ఒక రోజు ఆ విషయం నా ఆటోబయోగ్రపీలో చెబతాను. అప్పటి వరకు చెప్పను.... అని రేణు దేశాయ్ తెలిపారు.

అనవసరంగా తలనొప్పి
విడాకుల కారణం ఇపుడు చెబితే అనవసరంగా తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఇపుడు మూతికి టేపేసుకుని నోరు మూసుకుని మౌనం పరం శీలం అని మిన్నకుండి పోతున్నాను... అని రేణు దేశాయ్ తెలిపారు.

ముక్కలు ముక్కలుగా నిరికేస్తాం అన్నారు
మగాడు రెండో పెళ్లి చేసుకున్నపుడు ఆడది రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని నేను ప్రశ్నించడాని కారణం ఉంది. అంతకు ముందు ఫేస్ బుక్ లో ఓ కామెంట్ వచ్చింది. నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నిరికేస్తాం అన్నారు.... అందుకే ఈ ప్రకటన చేశాను.

మరో పెళ్లి తప్పకుండా చేసుకుంటాను
ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఇది నా జీవితం అని రేణు దేశాయ్ నొక్కి వక్కానించారు.

నన్ను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు భయపడుతున్నారు
నేను రేణుని పెళ్లి చేసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ కి పెళ్లి చేసుకుంటున్నాను అని అబ్బాయిలు ఫీలవుతున్నారు. అందుకనే నా పెళ్లి జరుగడం లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.... అని రేణు దేశాయ్ తెలిపారు.

ఇలాగే చచ్చిపోతానేమో? అనిపిస్తుంది
ఒక్కోసారి అనిపిస్తుంది... నేను ఇలా లైఫ్ లాంగ్ మగతోడు లేకుండానే ఉండి సచ్చిపోతానేమో?.... అంటూ రేణు దేశాయ్ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టారు.

ఎన్ని రోజులు ఏడవాలి? కర్మ అనుకుంటాను
విడిపోయినందుకు ఏమైనా బాధ పడుతున్నారా? అను ప్రశ్నకు స్పందిస్తూ నేను దాని కోసం ఎన్ని సంవత్సరాలు ఏడవాలి. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు... సరే అది మన కర్మ అనుకున్నాను. నేను డెస్టెనీని నమ్ముతాను... అని రేణు దేశాయ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ నాకు డబ్బు ఇవ్వలేదు
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి అన్యాయం చేయలేదు. విడిపోయే సమయంలో చాలా డబ్బు ఇచ్చారు. పిల్లల కోసం కూడా ఇచ్చారు అనే వార్తలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ... మీరు కూడా ఈ మాటలు నమ్మారా? నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఇపుడు నేను ఏం మాట్లాడినా బావుండదు
డైవర్స్ తీసుకుందామని మీరు అన్నారా? లేక ఆయన అన్నారా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.... 7ఇయర్స్ అయిపోయింది. ఇపుడేం మాట్లాడాలి? ఈ విషయంలో ఇపుడు నేను ఏం మాట్లాడినా బావుండదు.... అని రేణు దేశాయ్ తెలిపారు.

ముసలి దాన్ని అయిన తర్వాతే
ఆటో బయోగ్రఫీ ఎప్పుడు రాస్తారు? మరో పెళ్లి చేసుకున్న తర్వాతా? లేక పెళ్లికి ముందా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.... ఇప్పుడైతే రాయను, ముసలిదాన్ని అయిన తర్వాతే రాస్తాను అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











