twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మిపార్వతి చెప్పింది చెప్పను, ఎవరికీ తెలియంది చూపిస్తా: ఆర్జీవీ

    లక్ష్మీపార్వతి చెప్పిన విషయాలే తాను సినిమాలో చూపిస్తే అది అందరికీ తెలిసిన విషయాలే అవుతాయని రామ్ గోపాల్ వర్మ అన్నారు. తన సినిమాలో చూపించబోయే సంఘటనలు ఇప్పటి వరకు ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

    By Bojja Kumar
    |

    ఎన్టీఆర్ సినిమాల్లో రాణించి, రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయినప్ప‌టి ప‌రిస్థితులు.... ఆయన చివ‌రి రోజుల్లో అనుభ‌వించిన ప‌రిస్థితులు పూర్తిగా భిన్నమైనవని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు ఎంతో ఆసక్తికరమైనవని, వాటినే తాను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాగా తీయబోతున్నట్లు తెలిపారు.

    తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ... అన్ని అంశాల్లోనూ ఎన్టీఆర్ సూప‌ర్‌, సూప‌ర్ అనిపించుకున్నారు. కానీ ఆయన తన జీవితంలోకి ఒక మహిళను ఆహ్వానించిన తర్వాత ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నారు అని వర్మ తెలిపారు.

    మానసిక క్షోభకు కారణం ఎవరు?

    మానసిక క్షోభకు కారణం ఎవరు?

    ఎన్టీఆర్ జీవితంలోకి ఎవ‌రు ఎంట‌రైన త‌రువాత ఆయనలో ఎప్పుడూ చూడ‌ని మార్పు మొదలైంది, చివ‌రి రోజుల్లో ఆయన బాధాకర మాన‌సిక ప‌రిస్థితుల్లో వెళ్లడానికి కారణం ఏమిటి అనేది తాను సినిమాలో చూపిస్తానని వర్మ తెలిపారు.

    ఎవ్వ‌రికీ తెలియంది చూపాల‌నుకుంటున్నాను

    ఎవ్వ‌రికీ తెలియంది చూపాల‌నుకుంటున్నాను

    సినిమాల్లో ఏయే పాత్ర‌లు ఉంటాయో నేనిప్పుడు చెప్ప‌ను. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో ఏమీ మాట్లాడ‌లేదు. వారు రామారావు గురించి చెప్పాల్సింది అంతా ఇప్ప‌టికే మీడియా ముందు చెప్పేశారు. నేను మాత్రం ఎన్టీఆర్ గురించి ఎవ్వ‌రికీ తెలియంది చూపాల‌నుకుంటున్నాను' అని వర్మ అన్నారు.

    అది చెబితే అందరికీ తెలిసిందే అవుతుంది

    అది చెబితే అందరికీ తెలిసిందే అవుతుంది

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమా అంటే లక్ష్మీపార్వతి చెప్పింది తీస్తాననుకుంటే పొరపాటే. లక్ష్మీ పార్వ‌తి ఏం చెప్పారో అది తీస్తే అంద‌రికీ తెలిసిందే చెప్ప‌డం అవుతుందని, ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చిన త‌రువా‌త తెర‌వెనుక ఏం జ‌రిగిందో తన సినిమాలో ఉంటుందని అన్నారు.

    రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు

    రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తానని తాను చెప్పిన తర్వాత చాలా మంది చాలా రకాలైన కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా క‌థ గురించి ఎవ్వ‌రూ స‌రిగా 10 సెక‌న్లు కూడా ఆలోచించ‌క‌పోయి ఉండొచ్చని, అందుకే ఎన్నో ర‌కాల కామెంట్లు చేస్తున్నారని ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ అన్నారు.

    రెండు గంటల్లో బయోపిక్ తీయలేం

    రెండు గంటల్లో బయోపిక్ తీయలేం

    ఎన్టీఆర్ బయోపిక్ అంటే... ఎన్టీఆర్ స్టార్ కావడం, సూపర్ పొలిటీషియన్ కావడం ఇవన్నీ చూపాలి. వీటికి భినమైన అంశం ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన ఘట్టం.... రెండు గంటల్లో వీటిని చూపలేమని వర్మ అన్నారు.

     ఆయన జీవితం మహాభారతం

    ఆయన జీవితం మహాభారతం

    ఎన్టీఆర్ జీవితం నాకు మహాభారతంలోని చాప్టర్ల మాదిరిగా అనిపించింది. అందులో ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితం, ముఖ్యమంత్రి అయిన ఘట్టం, నాదేండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్, లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ఇలా చాలా ఉన్నాయి. లక్ష్మి పార్వతి ఎంటరైన దగ్గర నుంచి ఎన్టీఆర్ చనిపోయేవరకూ గల ఘట్టం నాకు చాలా నచ్చింది, అందుకే దాన్ని సినిమాగా తీస్తున్నట్లు వర్మ తెలిపారు.

    English summary
    The film, titled Lakshmi’s NTR, will focus on the icon’s life after Lakshmi Parvathi entered into his life. No wonder, RGV has already ruffled feathers in political circles and several voices from the ruling Telugu Desam Party have alleged that RGV might malign NT Rama Rao’s image with his take on NTR’s life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X