twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 50 రోజుల మాట: ఫ్యాన్స్‌కు ఊరట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పెట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతారనే ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. సమాజంలో, రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నన్ను ప్రశాంతంగా సినిమాలు తీసుకోనివ్వడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి.

    సమాజాన్ని మార్చేందుకు పవన్ తీసుకున్న పొలిటికల్ స్టెప్స్ అభిమానుల్లో ఆనందాన్ని నింపినా.....ఆయన ఇక సినిమాలకు దూరం అవుతారనే వార్తలను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.

    I will work only 50 days a year for my films: Pawan Kalyan

    'గతంలో తాను సంవత్సరానికి 100 రోజులు సినిమాల కోసం పని చేసే వాన్ని. ఇపుడు జన సేన పార్టీకి సంబంధించిన పనులు కూడా చూసుకోవాలి. గతంలోలా కాక పోయినా....సంవత్సరానికి 50 రోజులు సినిమాల కోసం కేటాయిస్తాను' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన సినిమాల్లో కొనసాగుతారని స్పష్టమవుతోంది.

    సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇక షూటింగులకు 50 కోజులు మాత్రమే కేటాయిస్తాననే ఆయన నిర్ణయం నేపథ్యంలో.........ఆయన సినిమా సినిమాకు గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతాననే సంకేతాలు ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' చిత్రం తో పాటు, హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈచిత్రాల విడుదల ఆలస్యం అవయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    English summary
    "Earlier I used to work for 100 days a year, but now I have to look after my party and will work only 50 days a year for my films" Pawan Kalyan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X